FD interest rates: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ కావాలా..? ఆ బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ ఎంతంటే..?

ప్రజలు అత్యంత విశ్వసించే పెట్టుబడి మార్గాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) ముందు వరుసలో ఉంటాయి. పూర్వకాలం నుంచి వీటికి ఆదరణ బాగా ఎక్కువగా ఉంది. బ్యాంకులలో డబ్బులు దాచుకోవడం సురక్షితమనే ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఎఫ్ డీలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. వీటిలో చేసిన డిపాజిట్లపై నిర్ణీత కాలానికి అసలుతో పాటు వడ్డీని తీసుకునే అవకాశం ఉంది.

FD interest rates: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ కావాలా..? ఆ బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ ఎంతంటే..?
Follow us
Srinu

|

Updated on: Nov 06, 2024 | 4:30 PM

పెట్టుబడిదారులకు ఏమాత్రం రిస్క్ లేకుండా రాబడి అందిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ లోని అన్ని బ్యాంకులు ఎఫ్ డీలను అమలు చేస్తున్నాయి. అయితే వీటిపై వడ్డీ రేట్లు మాత్రం మారుతూ ఉంటాయి. కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.

ప్రైవేటు బ్యాంకులు

  • యాక్సిస్ బ్యాంకులో ఏడాది ఎఫ్ డీలపై 6.70 శాతం, మూడేళ్ల కాలపరిమితి కలిగిన వాటిపై 7.10 శాతం, 5 ఏళ్ల వాటిపై 7 శాతం వడ్డీని అందిస్తున్నారు. అలాగే 15 నెలల నుంచి 2 ఏళ్ల లోపు వాటిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీ ఉంటుంది.
  • బంధన్ బ్యాంకులో ఏడాది ఎఫ్ డీలపై 8.05 శాతం, మూడేళ్ల వాటిపై 7.25 శాతం, ఐదేళ్ల కు 5.85 శాతం వడ్డీ ఇస్తున్నారు.
  • డీసీబీ బ్యాంకులో ఏడాదికి 7.10 శాతం, మూడేళ్లకు 7.55 శాతం, ఐదేళ్లకు 7.40 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నారు. అలాగే 19 నుంచి 20 నెలల డిపాజిట్లపై అత్యధికంగా 8.05 శాతం వడ్డీ ఇస్తున్నారు.
  • హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఎఫ్ డీలపై వివిధ రకాల వడ్డీరేట్లు అమల్లో ఉన్నాయి. ఏడాదికి 6.60 శాతం, మూడేళ్లకు 7 శాతం, ఐదేళ్లకు 7 శాతం అందిస్తున్నారు. 55 నెలల డిాపాజిట్లపై అత్యధికంగా 7.40 శాతం వడ్డీరేటు అమలవుతుంది.
  • ఇండస్ ఇండ్ బ్యాంకులో ఏడాదికి 7.75 శాతం, మూడేళ్లకు 7.25 శాతం, ఐదేళ్లకు 7.25 శాతం వడ్డీరేట్లు అమల్లో ఉన్నాయి.
  • ఆర్బీఎల్ బ్యాంకులో ఏడాదికి 7.50 శాతం, మూడేళ్లకు 7.50 శాతం, ఐదేళ్లకు 7.10 శాతం వడ్డీరేట్లు అందిస్తున్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు

  • బ్యాంకు ఆఫ్ బరోడాలో ఎఫ్ డీలపై ఏడాదికి 6.85 శాతం, మూడేళ్లకు 7.15 శాతం, ఐదేళ్లకు 6.80 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. 400 రోజుల బాబ్ ఉత్సవ్ డిపాజిట్లపై అత్యధికంగా 7.30 శాతం వడ్డీని అందిస్తున్నారు.
  • బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో ఏడాది ఎఫ్ డీలపై 6.75 శాతం, మూడేళ్లకు 6.50 శాతం, ఐదేళ్లకు 6.50 శాతం వడ్డీరేట్లు అందిస్తున్నారు. 333 రోజుల డిపాజిట్లకు అత్యధికంగా 7.40 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నారు.
  • సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఏడాదికి 6.85 శాతం, మూడేళ్లకు 6.75 శాతం, ఐదేళ్లకు 6.50 శాతం వడ్డీరేట్లు అమలవుతున్నాయి. 444 రోజుల డిపాజిట్లకు అత్యధికంగా 7.45 శాతం ఇస్తున్నారు.
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏడాదికి 6.80 శాతం, మూడేళ్లకు 7 శాతం, ఐదేళ్లకు 6.50 శాతంతో పాటు 7.25 శాతం అత్యధిక వడ్డీరేటును 400 రోజుల డిపాజిట్లపై అమల్లో ఉంది.
  • యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఏడాదికి 6.80 శాతం, మూడేళ్లకు 6.70 శాతం, ఐదేళ్ల కు 6.50 శాతం వడ్డీరేటు ఇస్తున్నారు. 333 రోజుల డిపాజిట్లపై అత్యధికంగా 7.40 శాతం వడ్డీరేటు అమలవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్