‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

'ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో' కాంటెస్ట్‌ను ప్రవేశ పెట్టింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన వారికి మంచి ప్యాకేజీ కూడా అందిస్తోంది. అంతేకాదు మీ పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది కూడా. ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం.. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో త‌యారీ కాంటెస్ట్‌లో గెలిచిన వారికి 25 వేల రూపాయ‌ల‌ను..

'ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో' త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2020 | 2:57 PM

‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ కాంటెస్ట్‌ను ప్రవేశ పెట్టింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన వారికి మంచి ప్యాకేజీ కూడా అందిస్తోంది. అంతేకాదు మీ పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది కూడా. ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం.. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో త‌యారీ కాంటెస్ట్‌లో గెలిచిన వారికి 25 వేల రూపాయ‌ల‌ను అందించ‌నుంది. అస‌లు ఈ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ఉద్దేశ‌మేంటంటే.. మ‌న దేశంలో అన్ని ర‌కాల ఉత్ప‌త్తులూ త‌యారు చేసుకుని.. మ‌న దేశ ప్ర‌జ‌లంతా వాటినే కొన‌డం. త‌ద్వారా.. మ‌న దేశంలోని ప్ర‌జ‌లే అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు దీనికి సంబంధించిన క్రియేటివ్ లోగో త‌యారీ కాంటెస్ట్ mygov.in నిర్వ‌హిస్తోంది. ఒక‌వేళ మీరు కూడా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాల‌నుకుంటే ఈ కింది రూల్స్‌ని పాటించాలి. అలాగే ఆగ‌ష్టు 24వ తేదీ రాత్రి 11.45 నిమిషాల లోపు మీరు త‌యారు చేసిన లోగోను mygov.inలో అప్‌లోడ్ చేయాలి.

కాంటెస్ట్ కండీష‌న్స్ః

– లోగో ఉద్దేశ‌మేంటో అందులో స్ప‌ష్టంగా చెప్పాలి – www.mygov.inలోని క్రియేటివ్ సెక్ష‌న్‌లో లోగోను అప్‌లోడ్ చేయాలి – ఒక వ్య‌క్తి ఒక లోగోను మాత్ర‌మే తయారు చేయాలి – లోగో మీ సొంత‌దై ఉండాలి. ఎలాంటి కాపీ రైట్ ఇష్యూ ఉండ‌కూడ‌దు – కాపీరైట్ స‌మ‌స్య‌లు వ‌స్తే దాన్ని పంపిన వ్య‌క్తులే బాధ్యుల‌‌వుతారు – లోగోతో పాటు మీ ప్రొఫైల్ కూడా పంపాల్సి ఉంటుంది. అంటే పేరు, ఫొటో, అడ్ర‌స్‌, మొబైల్ నెంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీ వంటివి ఇవ్వాలి – విజేతకు గెలిచిన‌ట్లు చెబుతూ ఈ మెయిల్ పంపుతారు. అలాగే మై గ‌వ్ బ్లాక్ పేజీలో విజేత పేరును ప్ర‌క‌టిస్తారు. – మెయిల్ వ‌చ్చిన మూడు రోజుల్లో రిప్లై ఇవ్వాలి. లేదంటే మ‌రో విజేత‌ను ప్ర‌క‌టిస్తారు – ఇక లోగో జేపీఈజీ, లేదా పీఎన్‌జీ, పీడీఎఫ్ ఫార్మాట్ల‌లోనే పంపాలి – లోగో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండాలి. లోగోను సీవైఎంకే, ఆర్‌జీబీ ఫార్మాట్ల‌లో తయారు చేయ‌వ‌చ్చు – ఫైల్ రిజ‌ల్యూష‌న్ 300 పిక్సెల్స్ త‌గ్గ‌కూడ‌దు – లోగోను డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌పై మాత్ర‌మే చేయాలి – లోగోను వెబ్‌సైట్లు, ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్ వంటి అన్ని చోట్లా వాడుకునేలా వీలుగా ఉండాలి – లోగో సైజ్ 5cmX5cm అలాగే.. 60cmX60cm ఉండొచ్చు. పోర్ట్రయిట్ లేదా లాండ్‌స్కేప్‌లో ఉండొచ్చు.

Read More:

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి