విశాఖ షిప్ యార్డ్‌లో కూలిన భారీ క్రేన్..10 మంది మృతి..

విశాఖ షిప్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. లోడ్ టెస్టింగ్ చేస్తుండగా..భారీ క్రేన్ బెర్త్‌పై కూలిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా క్రేన్ విరిగిపడటంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయినట్లుగా తెలుస్తోంది. 

విశాఖ షిప్ యార్డ్‌లో కూలిన భారీ క్రేన్..10 మంది మృతి..

విశాఖ షిప్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. లోడ్ టెస్టింగ్ చేస్తుండగా..భారీ క్రేన్ బెర్త్‌పై కూలిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా క్రేన్ విరిగిపడటంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయినట్లుగా తెలుస్తోంది.  పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగిస్తున్నారు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారన్నది క్లారిటీ రాలేదు. విరిగిపడిన క్రేన్ కింద మరికొంతమంది ఉన్నారని అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే, షిప్ యార్డు బయట ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే యార్డుల పనిచేస్తున్న సిబ్బంది బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమ వారు లోపల ఎలా ఉన్నారోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతుల తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. అయితే, అధికారులు మాత్రం ఎవరినీ లోనికి అనుమతించటం లేదని తెలుస్తోంది.

Read More:

తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..

పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది

టీచర్‌కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు

పుట్టినరోజు వేడుకలో విషాదం..ఈతకెళ్లిన విద్యార్థులు గల్లంతు

పెళ్లి ఇంట విషాదం…మూడో రోజే నవ వధువు ఆత్మహత్య

ఈ మేకలను బలిస్తే రక్తం రాదట..!

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu