జాతీయ అవార్డు గెలుచుకున్న శిల్పి కళాకృతులు‌ ధ్వంసం, రూ .40 లక్షలు నష్టం

హైదరాబాద్ లో ప్రముఖ శిల్పి కె కుమారా స్వామి కళాకృతులను దుండగులు ధ్వంసం చేశారు. సుమారు 40 లక్షల రూపాయల విలువైన శిల్పాలు హిమాయత్‌సాగర్ సమీపంలో రోడ్డు పక్కన పడేశారు.

జాతీయ అవార్డు గెలుచుకున్న శిల్పి కళాకృతులు‌ ధ్వంసం, రూ .40 లక్షలు నష్టం
Follow us

|

Updated on: Aug 01, 2020 | 3:00 PM

Artwork Damage : హైదరాబాద్ లో ప్రముఖ శిల్పి కె కుమారా స్వామి కళాకృతులను దుండగులు ధ్వంసం చేశారు. సుమారు 40 లక్షల రూపాయల విలువైన శిల్పాలు హిమాయత్‌సాగర్ సమీపంలో రోడ్డు పక్కన పడేశారు. కె కుమారా స్వామి, జాతీయ అవార్డు గెలుచుకున్న కళాకారుడు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు. అందుతోన్న స‌మాచారం మేర‌కు కుమార స్వామి గండిపేటలో నివశిస్తుంటాడు. ఆయ‌న త‌యారుచేసిన‌ శిల్పాలను కిస్మత్‌పురాలోని అద్దె గోడౌన్‌లో ఉంచారు. అతను తన వర్క్‌షాప్‌ను అక్కడి నుంచి నడపడానికి ఎమ్ నవీన్ కుమార్ అనే వ్య‌క్తి నుంచి ఏడాదిన్నరపాటు లీజుకు తీసుకున్నాడు. అయితే, బుధవారం సాయంత్రం, కొంతమంది దుండగులు, ఆ గోడౌన్ యజమానులు అని చెప్పుకుంటూ, అక్కడ ఉంచిన శిల్పాలను నాశ‌నం చేశారు. వాటిలో కొన్ని శిల్పాలు కాల్చివేయ‌డంతో పాటు మ‌రికొన్ని సమీపంలోని డంప్‌యార్డ్‌లో ప‌డేశారు.

కాగా, దెబ్బతిన్న శిల్పాలలో, కొన్ని హ్యాండ్ఓవర్ కోసం సిద్ధంగా ఉండ‌గా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని కుమార స్వామి పోలీసుల‌కు తెలిపారు. విగ్రహాలన్నీ దెబ్బతిన్నాయ‌ని, దాదాపు రూ .40 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని వివ‌రించారు. కుమార స్వామి అందించిన వివరాల ఆధారంగా రుక్మా రెడ్డి అనే వ్య‌క్తితో పాటు మ‌రికొంద‌రిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప‌రారీలో ఉన్న నిందిత‌లు కోసం గాలిస్తున్నారు.

Read More : ఆగ‌స్టు నెలలో స్థిరంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు : తాజా రేట్లు ఇలా