ఆగ‌స్టు నెలలో స్థిరంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు : తాజా రేట్లు ఇలా

గ‌త రెండు నెల‌లుగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నెల‌లో మాత్రం ఎలాంటి హెచ్చ‌త‌గ్గులు లేకుండా ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగ‌నున్నాయి.

ఆగ‌స్టు నెలలో స్థిరంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు : తాజా రేట్లు ఇలా
Follow us

|

Updated on: Aug 01, 2020 | 10:15 AM

LPG cylinder price Latest : గ‌త రెండు నెల‌లుగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆగ‌స్టు నెల‌లో మాత్రం ఎలాంటి హెచ్చ‌త‌గ్గులు లేకుండా ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగ‌నున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలను ప్రతి నెల మొదటి రోజున సమీక్షిస్తారు. అంతర్జాతీయ ఇంధన రేట్లు, యుఎస్ డాలర్-రూపాయి మార‌కం విలువ‌ను బట్టి ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి. గ‌త నెల‌లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధ‌ర ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో మూడ‌న్న‌ర రూపాయ‌లు పెర‌గింది. జూన్‌లో రూ. 11.50 పైస‌లు పెరిగింది. ఫిబ్ర‌వ‌రిలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ల రేట్లు రూ.858 వ‌ర‌కు పెరి‌గాయి. మార్చిలో గ్లోబ‌ల్ ఆయిల్ మార్కెట్ పై క‌రోనా ప్ర‌భావం ప‌డిన నేప‌థ్యంలో ధ‌ర రూ.805కు ప‌డిపోయింది. మే నెల‌లో ధ‌ర‌లు మ‌రింత ప‌డిపోవ‌డంతో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌ 581 రూపాయ‌ల‌కు చేరుకుంది.

తాజా ఎల్‌పిజి సిలిండర్ రేట్లు (ఇండియ‌న్ – సబ్సిడీ లేని 14.2 కిలోలు) :

ఢిల్లీ — రూ. 594

కోల్ క‌తా — రూ. 621

ముంబై — రూ. 594

చెన్నై — రూ. 610.50

కాగా వినియోగదారులందరూ మార్కెట్ ధరకే ఎల్‌పీజీ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంత‌రం ప్రభుత్వం సబ్సిడీని నేరుగా అర్హత ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది. నిబంధనల ప్రకారం, అర్హ‌త ఉన్న కుటుంబానికి సబ్సిడీ ధరలకు 12 సిలిండర్లను(14.2 కిలోలు) మాత్రమే అంజేస్తుంది ప్ర‌భుత్వం. అంత‌కుమించి అవ‌స‌రాలు ఉంటే, మార్కెట్ రేట్లకు కొనుగోలు చేయాలి. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… జూన్ త్రైమాసికంలో ఎల్పీజీ అమ్మకాలు 15.7% పెరిగాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం పేదల కోసం ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ ఉచిత వంట గ్యాస్ పథకమే.

Read More : సామాన్యుల‌కు షాక్.. దూసుకెళ్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు !