తెలంగాణ‌లో అన్‌లాక్ 3.0 న్యూ రూల్స్‌! క‌ర్ఫ్యూ ఎత్తివేత‌

ప్ర‌స్తుతం అన్‌లాక్ 3.0లోకి అడుగుపెట్టాం. దీంతో ప్ర‌జ‌ల‌కు అనుగుణంగా మ‌రిన్ని రూల్స్‌ని మార్చింది కేంద్రం ప్ర‌భుత్వం. అయితే క‌రో‌నా తీవ్ర‌త దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్‌లాక్ 3.0 రూల్స్ ప్ర‌కారం క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ కంటైన్మెంట్ జోన్స్‌లో ఆగ‌ష్టు 31వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించింది..

తెలంగాణ‌లో అన్‌లాక్ 3.0 న్యూ రూల్స్‌! క‌ర్ఫ్యూ ఎత్తివేత‌
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2020 | 11:58 AM

ప్ర‌స్తుతం అన్‌లాక్ 3.0లోకి అడుగుపెట్టాం. దీంతో ప్ర‌జ‌ల‌కు అనుగుణంగా మ‌రిన్ని రూల్స్‌ని మార్చింది కేంద్రం ప్ర‌భుత్వం. అయితే క‌రో‌నా తీవ్ర‌త దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్‌లాక్ 3.0 రూల్స్ ప్ర‌కారం క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ కంటైన్మెంట్ జోన్స్‌లో ఆగ‌ష్టు 31వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించింది ప్రభుత్వం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త రూల్స్ కూడా జారీ చేసింది. ఇక రాత్రి వేళ‌ల్లో ఉండే క‌ర్ఫ్యూని సైతం తెలంగాణ ప్ర‌భుత్వం ఎత్తివేసింది. తెలంగాణ నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు ప్రయాణాల‌కు సంబంధించి ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కాస్త ఊర‌ట ల‌భించిన‌ట్టైంది. కానీ కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్‌డౌన్ మాత్రం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంట‌ర్ల‌పై ఆగ‌ష్టు 31 వ‌ర‌కూ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పేర్కొంది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్‌, బార్స్‌, మెట్రో రైలు సేవ‌ల‌పై కూడా ఆంక్ష‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

ఇక కేంద్రం జారీ చేసిన నిబంధ‌న‌ల్లో భాగంగా.. ఈ నెల 5వ తేదీ నుంచి జిమ్‌లు, యోగా సెంట‌ర్ల‌కు అనుమ‌తినిచ్చింది తెలంగాణ స‌ర్కార్‌. అలాగే శుభ‌కార్యాలు నిర్వ‌హించుకోవడానికి నిబంధ‌న‌ల‌తో కూడిన రూల్స్ జారీ చేసింది. ఇంత‌కు ముందు లాగానే పెళ్లిళ్ల‌కు 50 మంది, అంత్య క్రియ‌ల‌కు 20 మంది వ‌ర‌కూ పాల్గొన‌వ‌చ్చ‌ని పేర్కొంది. అలాగే ఇవాళ్టి నుంచి రాత్రి పూట క‌ర్ఫ్యూని సైతం ఎత్తివేసింది. మ‌రోవైపు రాజ‌కీయ‌, క్రీడా, సామాజిక‌, సాంస్కృతిక స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తి తెలంగాణ స‌ర్కార్‌ లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Read More:

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి