ఏపీలోకి వచ్చేవారికి గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ..

అన్‌లాక్‌ 3.0 నేపధ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది.

ఏపీలోకి వచ్చేవారికి గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ..

Lockdown Relaxations In Andhra Pradesh: అన్‌లాక్‌ 3.0 నేపధ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణీకుల కోసం ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే.. ఈ పాస్ జారీ చేయనున్నారు. సంబంధిత వ్యక్తి మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్‌కు పాస్ వివరాలు పంపనున్నారు.

బోర్డర్ చెక్‌పోస్ట్‌ల వద్ద ఈ-పాస్‌తో పాటు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇవి రెండూ ఉంటేనే పోలీసులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఇక రేపటి నుంచి ఆటోమేటిక్ ఈ-పాస్‌లు జారీ చేస్తామని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు. కాగా, గతంలో ఈ-పాస్‌లు జారీ చేయడానికి మూడు నుంచి నాలుగు రోజులు సమయం పట్టేది. అయితే అన్‌లాక్‌ 3.0 నేపధ్యంలో అధికారులు ఆటోమేటిక్ ఈ-పాస్‌లు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు.

ఆగష్టు 15 ఏపీ రాజధాని తరలింపు.. పంద్రాగస్టు వేడుకలు అక్కడే…

Click on your DTH Provider to Add TV9 Telugu