రూ.కోటి విలువైన పాము విషం పట్టివేత, ఇద్దరి అరెస్ట్

పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో సీఐడీ అధికారులు, పోలీసులు కోటి రూపాయల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. 600 గ్రాముల విషాన్ని ఇద్దరు వ్యక్తులు విదేశాలకు స్మగుల్ చేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఇది అంతర్జాతీయ..

రూ.కోటి విలువైన పాము విషం పట్టివేత, ఇద్దరి అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 01, 2020 | 12:43 PM

పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో సీఐడీ అధికారులు, పోలీసులు కోటి రూపాయల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. 600 గ్రాముల విషాన్ని ఇద్దరు వ్యక్తులు విదేశాలకు స్మగుల్ చేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఇది అంతర్జాతీయ రాకెట్ అని, ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో వీరితో బాటు మరికొందరికి కూడా ప్రమేయం ఉండవచ్చునని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. అలం మియా, ముస్ఫిక్ మియా అనే వీరు దక్షిణ దినాజ్ పూర్ జిల్లాకు చెందినవారని వారు తెలిపారు. ఫ్రాన్స్ లో తయారైన బుల్లెట్ ప్రూఫ్ బాక్సులో ఉంచిన  ఈ పాము విషాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

పాము విషానికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. దీన్ని మందుల తయారీలోనే గాక, కొన్ని రకాల డ్రగ్స్ తయారీలో కూడా వినియోగిస్తారట. ఇండియా వంటి దేశాల నుంచి పాము విషాన్ని దిగుమతి చేసుకునే ముఠాలు కొన్ని లక్షల డాలర్లను సంపాదిస్తున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు.