ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం!

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ-షార్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌కూడ‌దా? ప‌్ర‌భుత్వ‌ కార్యాల‌యాల్లో విధులు నిర్వ‌ర్తించే అధికారులు, సిబ్బంది వ‌స్త్రాధార‌ణ‌పై ఆంక్ష‌లు విధించారు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ డివిజ‌న్‌ క‌మిష‌న‌ర్ ఎంబీ ఓజా. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం!

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ-షార్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌కూడ‌దా? ప‌్ర‌భుత్వ‌ కార్యాల‌యాల్లో విధులు నిర్వ‌ర్తించే అధికారులు, సిబ్బంది వ‌స్త్రాధార‌ణ‌పై ఆంక్ష‌లు విధించారు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ డివిజ‌న్‌ క‌మిష‌న‌ర్ ఎంబీ ఓజా. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇక‌పై ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ప‌ని చేసే ఉద్యోగులు ఫార్మ‌ల్‌గా, గౌర‌వ‌ప్ర‌ద‌మైన దుస్తులు ధ‌రించి కార్యాల‌యానికి రావాల‌ని ఆదేశించారు. గ‌వ‌ర్న‌మెంట్ కార్యాల‌యాల్లో టీ ష‌ర్టులు, జీన్స్ ధ‌రించ‌టాన్ని నిషేధించారు. ఆదేశాల‌కు విస్మ‌రించిన వారిపై క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్య చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు గ్వాలియ‌ర్ డివిజ‌న్‌ క‌మిష‌న‌ర్ ఎంబీ ఓజా. అలాగే ప్ర‌భుత్వ‌ స‌మావేశాల‌కు కూడా సీనియ‌ర్ అధికారులు టీ ష‌ర్టులు, జీన్స్ వేసుకుని రాకూడ‌ద‌న్నారు. ఈ నేప‌థ్యంలో దుస్తుల‌పై ఆంక్ష‌లు విధిస్తూ డివిజ‌న్ అధికారులకు, క‌లెక్ట‌ర్ల‌కు లేఖ రాశారు.

జులై 20వ తేదీన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అధ్య‌క్ష‌త‌న ఓ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంద‌సౌర్ జిల్లా మెజిస్ట్రేట్ టీ ష‌ర్ట్ వేసుకుని హాజ‌ర‌య్యారు. దీనిపై ముఖ్య‌మంత్రి అస‌హ‌నం వ్య‌క్తం చేశారట‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఇక‌పై టీ ష‌ర్టులు, జీన్స్ ధ‌రించ‌డంపై నిషేధం విధించారు. అలాగే త‌మ ఉత్త‌ర్వుల‌ను ఉల్ల‌ఘించిన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

Read More:

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి

Click on your DTH Provider to Add TV9 Telugu