టీచర్‌కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు

కరోనా, లాక్‌డౌన్ చాలా మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దయనీయాంగా మారింది.

టీచర్‌కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు
Follow us

|

Updated on: Aug 01, 2020 | 12:19 PM

కరోనా, లాక్‌డౌన్ చాలా మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దయనీయాంగా మారింది. నాలుగైదు నెలల నుంచి జీతాలు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఉపాధి లేక, చేతిలో డబ్బులేక,ఇల్లు గడవని స్థితిలో కొందరు వ్యవసాయం చేస్తూ..మరికొందరు కూరగాయలు అమ్ముకుంటున్న సంఘటనలు చూస్తున్నాం..ఈ క్రమంలోనే ఓ ఉపాధ్యాయుడు పడుతున్న అవస్థలు చూడలేక పూర్వ విద్యార్థులు ఆయన రుణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు. చేతిలో పనిలేక అవస్థలు పడుతున్న గురువుకు ఉపాధి కల్పించారు.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన‌ 52 ఏళ్ల ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయుడు హ‌నుమంతుల రఘుకు కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. టీచ‌ర్ వృత్తి కోల్పోవ‌డంతో అత‌ని కుటుంబానికి ఆర్థిక క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అత‌ని కుమారుడు కూడా నిరుద్యోగి కావ‌డంతో ఇల్లు గడవడం మ‌రింత‌ కష్టమైపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న ఆయన పూర్వ విద్యార్థులు రఘుకు సాయం చేయాల‌ని భావించారు. 1997-98 బ్యాచ్‌కు చెందిన కొంతమంది విద్యార్థులంతా కలిసి వారి గురువుకు టిఫిన్ సెంట‌ర్ పెట్టుకొనేందుకు ఓ షెడ్డును క‌ట్టించారు.

విద్యార్థుల సాయానికి ఉప్పొంగిన ఉపాధ్యాయుడు ఆ టిఫిన్ సెంట‌ర్‌కు ‘గురుద‌క్షిణ’ అని నామ‌క‌ర‌ణం చేశాడు. తనను ఆదుకునేందుకు వ‌చ్చిన తన పూర్వ విద్యార్థుల‌కు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియ‌డం లేదంటూ రఘు భావోద్వేగానికి లోన‌య్యారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టిఫిన్ సెంట‌ర్‌కు క‌స్టమ‌ర్లను కూడా తామే తీసుకొస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..

పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!