పెళ్లి ఇంట విషాదం…మూడో రోజే నవ వధువు ఆత్మహత్య

పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. సంతోషంతో అత్తవారింటి వెళ్లాల్సిన కొత్త పెళ్లి కూతురు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద సంఘటన

పెళ్లి ఇంట విషాదం...మూడో రోజే నవ వధువు ఆత్మహత్య

పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. సంతోషంతో అత్తవారింటి వెళ్లాల్సిన కొత్త పెళ్లి కూతురు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని ఏడిద సీతానగరానికి చెందిన దంపతుల కూమార్తె డిగ్రీ చదువుతోంది. ఇంకా విడుదలకాని ఓ షార్ట్ మూవీలో హీరోయిన్‌గానూ నటించింది. అయితే, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం ఈశ్వరం గ్రామానికి చెందిన ఆ అమ్మాయి మేనమామతో ఆమెకు ఈ నెల 26న వివాహం జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనల మేకరు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి తంతు పూర్తి చేశారు ఇరువురు కుటుంబీకులు. కాగా, శనివారం రోజున ఆమెను అత్తవారి ఇంటికి పంపాల్సి ఉండగా…పెళ్లైన మూడో రోజు శుక్రవారం ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కొనఊపిరితో ఉన్న ఆమెను మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మార్గమధ్యలోనే నవవధువు కన్నుమూసింది. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇష్టం లేని పెళ్లి కారణంగా లేదా తన ఉన్నత చదువు ఆగిపోయిందన్న బాధతోనో కొత్త పెళ్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి ఫోన్ కాల్ డేటా వివరాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, మరణించిన యువతి ఇటీవల ‘లవ్ ఫెయిల్యూర్’ ఇతివృత్తంగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్ రేపు(ఆదివారం) విడుదలకానున్నట్లు సమాచారం.

Read More:

తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..

పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది

టీచర్‌కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు

పుట్టినరోజు వేడుకలో విషాదం..ఈతకెళ్లిన విద్యార్థులు గల్లంతు

Click on your DTH Provider to Add TV9 Telugu