పుట్టినరోజు వేడుకలో విషాదం..ఈతకెళ్లిన విద్యార్థులు గల్లంతు
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు విషాదాంతంగా మారాయి. ఈత సరదాతో ముగ్గురు విద్యార్థులు నీళ్లలో పడి గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు విషాదాంతంగా మారాయి. ఈత సరదాతో ముగ్గురు విద్యార్థులు నీళ్లలో పడి గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరానికి చెందిన ముగ్గురు చిన్నారులు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం గ్రామ సమీపంలోని తోటకి వెళ్లారు. అందరూ కలిసి సరదాగా కేక్ కట్ చేశారు. అనంతరం ఈత కొడదామని పక్కనే ఉన్న పోలవరం కాల్వలో దిగారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీళ్లలో పడి కొట్టుకుపోయారు. విద్యార్థులు గల్లంతయ్యారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కాల్వలో గాలింపు చేపట్టారు. చిన్నారులు గల్లంతు కావడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర దుంఖంలో మునిగిపోయారు.
Read More:
తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..
పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది
టీచర్‌కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు




