BREAKING NEWS : ఆ నలుగురు అగంతకులు దొరికారు..

సినీ నటుడు మోహన్ బాబు ఫాం హౌస్ వద్ద కలకలం సృష్టించిన దుండగులను పోలీసులు గుర్తించారు. మైలార్దేవ్పల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించిన పోలీసులు గుర్తించారు...

BREAKING NEWS : ఆ నలుగురు అగంతకులు దొరికారు..

Mohan Babu’s House : సినీ నటుడు మోహన్ బాబు ఫాం హౌస్ వద్ద కలకలం సృష్టించిన దుండగులను పోలీసులు గుర్తించారు. మైలార్దేవ్పల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించిన పోలీసులు గుర్తించారు. కారులో వచ్చి మంచు ఫాం హౌస్ వాచ్ మెన్ బెదిరించిన నలుగురు వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. జల్‌పల్లి గ్రామ శివారులో సినీనటుడు మోహన్‌బాబుకు సంబంధించిన మంచు టౌన్‌షిప్‌ పేరుతో నివాసం ఉంది.

నిన్న (శనివారం)సాయంత్రం 5 గంటల సమయంలో లోపలి నుంచి బైక్‌ బయటకు వెళ్లడానికి వాచ్‌మెన్‌ పెద్ద గేటు తెరిచాడు. అదే సమయంలో బయట నుంచి వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు లోనికి ప్రవేశించింది. ఇది గమనించిన వాచ్‌మెన్‌ ఆపేందుకు ప్రయత్నించాడు. వాచ్‌మెన్‌ ఇచ్చిన సమాచారంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మోహన్‌బాబు ఫిర్యాదు మేరకు పోలీసులకు ఫిర్యాదే చేసిన సంగతి తెలిసిందే.