‘బుట్టబొమ్మ’ ఖాతాలో మరో రికార్డ్..

‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌ అయిందో.. అంతకంటే ఎక్కువగా ఆ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ హిట్స్‌ను అందుకుంటోంది. సినిమా విడుదలైనప్పటి నుంచి ‘..

‘బుట్టబొమ్మ’ ఖాతాలో మరో రికార్డ్..

‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌ అయిందో.. అంతకంటే ఎక్కువగా ఆ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ హిట్స్‌ను అందుకుంటోంది. సినిమా విడుదలైనప్పటి నుంచి ‘బుట్టబొమ్మ’ సంచలనాలను నమోద చేస్తోంది. వ్యూస్, లైక్స్ అంటూ రోజూ ఏదో ఒక కొత్త రికార్డు ఈ పాట సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ పాట 300 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టినట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపారు.

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్డ్రీకి సంబంధించి ఏ పాటకు ఇంత క్రేజ్ రాలేదు. టిక్ టాక్ వంటి మాధ్యమాలతో ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పాట వినబడింది. థమన్ సంగీతం, రామజోగయ్య సాహిత్యానికి తోడు బన్నీ డ్యాన్స్, పూజా గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ అయ్యాయి. అందుకే యూట్యూబ్‌లో ఈ సాంగ్ విపరీతంగా క్రేజ్ అవుతోంది. ఇప్పుడీ పాట 300 మిలియన్ క్లబ్‌లోకి చేరి తెలుగు సినిమా స్థాయి ఏంటో మరోసారి చాటిచెప్పింది.