Breaking : రిమ్స్ నుంచి 10 మంది క‌రోనా బాధితులు ప‌రార్

క‌రోనా వ్యాప్తితో ప్ర‌పంచం అంతా అల్లక‌ల్లోలం అవుతుంటే మ‌రోవైపు వైర‌స్ బాధితులు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఏ మాత్రం బుద్దిలేని ప‌నులు చేస్తూ వ్యాధి వ్యాప్తికి కార‌ణం అవుతున్నారు.

Breaking : రిమ్స్ నుంచి 10 మంది క‌రోనా బాధితులు ప‌రార్

Corona Patients Escape  : క‌రోనా వ్యాప్తితో ప్ర‌పంచం అంతా అల్లక‌ల్లోలం అవుతుంటే మ‌రోవైపు వైర‌స్ బాధితులు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఏ మాత్రం బుద్దిలేని ప‌నులు చేస్తూ వ్యాధి వ్యాప్తికి కార‌ణం అవుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్ లో కలకలం చెల‌రేగింది. పది మంది కరోనా బాధితులు కరోనా వార్డు నుండి పరార‌య్యారు. సెక్యూరిటీ కళ్లు గప్పి త‌ప్పించుకుపోయారు. వీరిలో ఆరుగురు కరోనా పాజిటివ్ వ్య‌క్తులు ఉండ‌గా.. మరో నలుగురు అనుమానితులు ఉన్నారు. పరారైన వారిలో ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు ఉన్నట్లు రిమ్స్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వెంట‌నే రిమ్స్ సూపరింటెండెంట్, డీఎంహెచ్వో కు సమాచారం ఇచ్చారు సిబ్బంది. పరారైన బాధితుల కోసం గాలింపు చర్యలు చేప‌ట్టారు. కాగా ఆస్ప‌త్రిలో వసతులు స‌రిగా లేవంటూ బాధితులు గత వారం రోజులుగా నిరసన వ్యక్తం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే పారిపోయి ఉంటార‌ని భావిస్తున్నారు.

 

Read More : తెలంగాణలో గ్రామ పంచాయతీల ఆన్‌లైన్ ఆడిట్

Click on your DTH Provider to Add TV9 Telugu