పౌర్ణమినాడు జన్మించారా? ఈ రాశులదే అదృష్టమంతా.. వీరిలో మీరూ ఉన్నారా?
భారత ఆధ్యాత్మిక సంప్రదాయాలలో పౌర్ణమి రోజుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పౌర్ణమినాడు చంద్రుడు తన పూర్తి శక్తితో ఉంటారని నమ్ముతారు. ఇది ఒక వ్యక్తి మనస్సు, స్వభావం, జీవిత దిశను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అందుకే పౌర్ణమినాడు జన్మించడం అదృష్టంగా భావిస్తారు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు భావోద్వేగ సమతుల్యత, అంతర్గత శాంతి, సహజ ఆకర్షణ కలిగి ఉంటారని చెబుతారు. ఈరోజు జన్మించిన కొన్ని రాశులు వారిని అదృష్టవంతులుగా పేర్కొంటారు.

భారతీయ జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మిక సంప్రదాయాలలో పౌర్ణమి రోజుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజును పవిత్రదినంగా భావిస్తారు. చాలా మంది నదులలో పుణ్యస్నానాలు చేసి, ఆలయాలను సందర్శిస్తుంటారు. పౌర్ణమినాడు చంద్రుడు తన పూర్తి శక్తితో ఉంటారని నమ్ముతారు. ఇది ఒక వ్యక్తి మనస్సు, స్వభావం, జీవిత దిశను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అందుకే పౌర్ణమినాడు జన్మించడం అదృష్టంగా భావిస్తారు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు భావోద్వేగ సమతుల్యత, అంతర్గత శాంతి, సహజ ఆకర్షణ కలిగి ఉంటారని చెబుతారు.
పౌర్ణమి అంటే చంద్రుడు సంపూర్ణంగా కనిపించే రోజు. వేద జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలు, అంతర్ దృష్టికి సంకేత గ్రహంగా పరిగణిస్తారు. అందుకే పౌర్ణమినాడు జన్మించినవారు తరచుగా సున్నితంగా, అర్థం చేసుకువానేవారై ఉంటారు. అంతర్గత శక్తిని కలిగి ఉంటారు. వీరు కరుణ, సానుభూతి, భావోద్వేగ పరిపక్వతను చూపిస్తారు. ఇతరుల భావాలను అర్థం చేసుకుంటూ సమతుల్య దృక్పథాన్ని ప్రదర్శిస్తారు.
పౌర్ణమినాడు జన్మించినవారి ప్రధాన లక్షణాలు
పౌర్ణమినాడు జన్మించినవారికి లోతైన భావోద్వేగ అవగాహన ఉంటుంది. వారు తమ సంబంధాలలో నిజాయితీపరులుగా, అంకితభావం కలిగి ఉంటారు. స్వతహాగా సున్నితంగా, ప్రశాంతంగా ఉంటారు. అంతేగాక, అవసరమైనప్పుడు దృఢమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. బలమైన సృజనాత్మకను కలిగి ఉంటారు. వీరు సహజంగానే సంగీతం, రచన, కళ, కౌన్సెలింగ్ లేదా వైద్యం వంటి రంగాలవైపు ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక కోరికను కూడా ప్రదర్శిస్తారు. ధ్యానం, ప్రార్థన, ఆత్మీపరిశీలన వారి జీవితంలో సహజమైన భాగంగా ఉంటుంది.
స్థిరంగా జీవితం.. కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం
పౌర్ణమినాడు జన్మించినవారు జీవితంలో నెమ్మదిగా గానీ, స్థిరంగా అభివృద్ధిని సాధిస్తారు. విజయం అకస్మాత్తుగా రాదు. నిరంతర కృషితో వస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, మనస్తత్వశాస్త్రం, బోధన, ప్రజా సంబంధాలు, సృజనాత్మకత రంగాల్లో బాగా రాణిస్తారు. వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉంటారు. భావోద్వేగాల ఆధారంగా పెద్ద రిస్క్‌లు తీసుకోకుండా ఉంటారు. ఇది వారి జీవితంలో భద్రత, సమతుల్యతను కాపాడుతుంది.
సంబంధాలలో పౌర్ణమినాడు జన్మించినవారు సున్నితంగా, నిజాయితీగా ఉంటారు. వారు భావోద్వేగ అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో సమతుల్యత కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల పట్ల బాధ్యత అనేది వారికి సహజంగానే వస్తుంది. ఆరోగ్యం, మానసిక సమతుల్యతను కాపాడుకోవాలి. పౌర్ణమినాడు జన్మించిన వారందరికీ శుభప్రదంగా ఉన్నప్పటికీ.. కొన్ని రాశులవారికి మరింత అదృష్టం కలిసివస్తుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం
కర్కాటక రాశి: చంద్రుడు శాంతి స్వరూపుడు కాబట్టి.. పౌర్ణమినాడు జన్మించిన కర్మాటక రాశివారు చాలా అదృష్టవంతులు అని భావిస్తారు. వారు భావోద్వేగ స్థిరత్వం, కుటుంబ ఆనందం, ఆధ్యాత్మిక పురోగతితో జీవితం సాఫీగా సాగుతుంది.
వృషభ రాశి: వృషభ రాశి పౌర్ణమి సమయంలో జన్మించినవారు భౌతిక ఆనందం, ఆర్థిక స్థిరత్వం, కళాత్మక విజయం పొందుతారు. వారు స్థిరమైన సంబంధాలు, సౌకర్యవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు.
మీన రాశి: పౌర్ణమిరోజున జన్మించిన మీన రాశివారు లోతైన అంతర్ దృష్టి, ఆధ్యాత్మిక దృక్పథం కలిగి ఉంటారు. వైద్యం, కళ, సేవ, భక్తి వంటి రంగాలలో పురోగతి సాధిస్తారు.
తుల: పౌర్ణమినాడు జన్మించిన తుల రాశివారు ప్రత్యక ఆకర్షణను కలిగి ఉంటారు. మానసిక సమతుల్యత, సామాజిక విజయాలను అందుకుంటున్నారు. వీరికి భాగస్వామ్యాలు, ప్రజా వ్యవహారాలు, ప్రజా సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
ధనస్సు: పౌర్ణమినాడు జన్మించిన ధనస్సు రాశి వారికి జ్జానం, ఉన్నత విద్య, నైతిక పురోగతి అందుకుంటారు. బోధన, కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం వంటి రంగాలలో ముందుకు సాగుతారు.
Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.
