AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరు చెరకు రసం తాగితే యమ డేంజర్.. తాగే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

చెరకు రసం తక్షణ శక్తిని, చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో పోషకాలు ఉన్నప్పటికీ, అధిక చక్కెర కారణంగా మధుమేహం, ఊబకాయం, కాలేయ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం చాలా మంచిది. దంత సమస్యలు కూడా రావొచ్చు. అసలు ఎవరికి చెరుకు రసం మంచిది కాదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వీరు చెరకు రసం తాగితే యమ డేంజర్.. తాగే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
Side Effects Of Sugarcane Juice
Krishna S
|

Updated on: Jan 03, 2026 | 10:01 PM

Share

చలికాలం, వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది చల్లని చెరకు రసం. రోడ్డు పక్కన దొరికే ఈ సహజ పానీయం తాగగానే శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా వస్తుంది. అయితే చెరకు రసం అందరికీ ఆరోగ్యకరం కాదని, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పోషకాల గని.. ఆరోగ్యానికి మేలు

చెరకు రసంలో కేవలం తీపి మాత్రమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే సహజ కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. అందుకే నీరసంగా ఉన్నప్పుడు ఇది బెస్ట్ ఎనర్జీ డ్రింక్. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి, గుండె పనితీరుకు తోడ్పడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోకెమికల్స్ కణాల నష్టాన్ని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం కాంతివంతంగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది.

ప్రమాదం ఎక్కడ ఉందంటే?

ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ చెరకు రసంలో సహజ చక్కెర, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

వీరు దూరంగా ఉండటమే మంచిది!

మెదాంత హాస్పిటల్ నిపుణులు డాక్టర్ సౌరవ్ శిశిర్ అగర్వాల్ ప్రకారం ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసాన్ని నివారించాలి..

మధుమేహ వ్యాధిగ్రస్తులు: రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున షుగర్ ఉన్నవారు లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.

ఊబకాయం: అధిక క్యాలరీల వల్ల బరువు పెరగాలనుకునే వారికి ఇది ఇబ్బందిగా మారవచ్చు.

లివర్ సమస్యలు: ఫ్యాటీ లివర్ లేదా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న రోగులు దీనిని తీసుకోకపోవడం ఉత్తమం.

దంత సమస్యలు: చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల దంతక్షయం వచ్చే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన చిట్కాలు

  • చెరకు రసాన్ని ఎప్పుడూ తీయగానే తాగాలి. నిల్వ ఉంచిన రసంలో బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది.
  • ఆరోగ్యవంతులు కూడా అప్పుడప్పుడు, పరిమిత పరిమాణంలో మాత్రమే తాగాలి.
  • రసం తీసే యంత్రాలు, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో గమనించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..