AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (January 3, 2026): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సాయం చేయడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 03 January 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (జనవరి 3, 2026): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీకి బాగా అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ రాబడికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం వృద్ది చెందుతుంది. నిరుద్యోగులు కొత్త ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4 రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆర్థిక సమస్యలు చాలావరకు తీరిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా పురోగమిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ వాతావరణం సామరస్యంగా, సానుకూలంగా సాగిపోతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చిన్న సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయంతో పాటు ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగి పోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో విలాస జీవితం అనుభవిస్తారు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శి స్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లబించడానికి అవకాశముంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వృథాఖర్చులు తగ్గించుకోవడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు, ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. దాంపత్యంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా అవకాశాలు అందుతాయి. సొంత పనుల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సన్నిహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడి స్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. పెండింగ్ పనులను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు బాగా సహాయపడతారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ రాబడిని పొందుతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశముంది. పిల్లలకు చదువుల్లో సమయం అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి డిమాండ్ పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితం చాలావరకు ఆశాజనకంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. చిన్న నాటి స్నేహితులతో ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Follow Us
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!