Sravana Bhargavi: పార్టనర్ ఎన్ని చేసినా కనిపించవు.. అలా ఉంటేనే లైఫ్ సాఫీగా ఉంటుంది.. శ్రావణ భార్గవి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ గాయనీగాయకులలో శ్రావణ భార్గవి ఒకరు. ఒకప్పుడు తన అందమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. కానీ ఈమధ్య ఆమె పేరు అంతగా వినిపించడం లేదు. కొన్నాళ్లుగా వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలుస్తున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. కెరీర్, లైఫ్ గురించి మాట్లాడింది.

సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ పాటలతో తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. చాలా కాలంగా సినీరంగంలో జోరు తగ్గించిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలపై తన ఆసక్తికరమైనవిషాయలను పంచుకుంది. బంధాల విషయంలో, భాగస్వాములు ఒకరికొకరు ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవడం ద్వారా జీవితాన్ని సులభంగా, ఆనందంగా గడపవచ్చని ఆమె అన్నారు. అలాగే “యువర్ ఫెమినైన్ ఎనర్జీ, యువర్ మాస్కులిన్ ఎనర్జీ” సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ, భాగస్వామి మద్దతు ఇస్తే ఎన్నో పనులు చేసినా ఒత్తిడి అనిపించదని తెలిపారు. ఒంటరిగా ఉన్నవారు తమ బాధ్యతలను నెరవేరుస్తూనే, తమను తాము పోషించుకోవడాన్ని, సమయాన్ని కేటాయించుకోవడాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ఒంటరిగా ఉన్నవారికి కూడా ఆమె ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. ఒంటరిగా ఉన్నప్పుడు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాలలో “మ్యాన్ అండ్ వుమెన్” రెండు పాత్రలనూ పోషించాల్సి వస్తుందని శ్రావణ భార్గవి పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో తమను తాము పోషించుకోవడం, స్వయం సంరక్షణకు సమయం కేటాయించడం చాలా కీలకమని ఆమె సూచించారు. “ఎంప్టీ ట్యాంక్” నుండి ఎవరూ ఏమీ ఇవ్వలేరని, కాబట్టి తమను తాము పెంపొందించుకోవడం, పంపార్ (Pamper) చేసుకోవడం అవసరమని ఆమె అన్నారు. తన స్వంత అనుభవాన్ని వివరిస్తూ, తనకు సంతోషాన్నిచ్చే పనులకు సమయం కేటాయించుకోవడానికి తాను ఏమాత్రం గిల్టీగా పీల్ కానని, తన నిర్ణయాలను ప్రశ్నించనని చెప్పారు. తన కుటుంబం తన నిర్ణయాలకు మద్దతు ఇస్తుందని, తాను తిరిగి వచ్చినప్పుడు మరింత ఉత్సాహంగా ఉంటానని వారికి తెలుసు అని అన్నారు.
తన డబ్బింగ్ కెరీర్ గురించి ప్రస్తావిస్తూ, త్రిష వంటి తారలకు వాయిస్ అందించిన అనుభవాలను పంచుకున్నారు. అలాగే, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రస్తావించారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో, శ్రావణ భార్గవి వారానికి కనీసం నాలుగు సార్లు వ్యాయామం చేస్తానని.. వ్యాయామం కేవలం శారీరక సౌందర్యం కోసమే కాదని, అంతర్గత ఆరోగ్యం, ముఖ్యంగా స్త్రీల హార్మోన్ల ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఆమె అన్నారు. వ్యాయామం తర్వాత విడుదలయ్యే “హ్యాపీ హార్మోన్స్” మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
