Actress : చిరంజీవి, నాగార్జునలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినీరరంగంలో తనదైన ముద్ర వేసింది. చిట్టి చిట్టి మాటలు.. అమాయకమైన నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలు గెలుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

1990లో నాలుగేళ్ల వయసులోనే ఓ చిన్నారి యావత్ సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తన అమాయకమైన నటన, చక్కటి చిరునవ్వుతో భారతదేశం అంతటా సినీప్రియుల హృదయాలు గెలుచుకుంది. అంతేకాదు.. నాలుగేళ్ల వయసులోనే ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంలో మానసిక వికలాంగురాలిగా కనిపించింది. ఇదే చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుంది. ఆ అవార్డ్ గెలుచుకున్న అతి పిన్న వయస్కులలో ఈ చిన్నది ఒకరు. చైల్డ్ ఆర్టిస్టులుగా తనదైన ముద్ర వేసిన ఈ చిన్నారి.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంది. అలాగే ఆమె హీరోయిన్ గానూ సక్సెస్ కాలేదు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శ్యామిలీ. ఆమె సినీ ప్రయాణం రెండేళ్ల వయసులోనే ప్రారంభమైంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అంజలి సినిమా పెద్ద విజయాన్ని సాధించినప్పటికీ, శ్యామిలి తన మలయాళ చిత్రం మాలూట్టి (1990) కి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. తొంభైలలో దక్షిణ భారత సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ బాలనటిగా నిలిచింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబోలో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
అయితే చైల్డ్ ఆర్టిస్టుగా సక్సెస్ అయినప్పటికీ హీరోయిన్ గా అంతగా మెప్పించలేకపోయింది. 2009లో సిద్ధార్థ్ సరసన ఓయ్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఉత్తమ తొలి నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. కానీ ఈ సినిమా నిరాశపరచడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. తమిళంలో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ సినిమాలు వదిలేసి చదువుపై దృష్టి పెట్టింది. 2016లో, ఆమె విక్రమ్ ప్రభు సరసన వీర శివాజీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ మరోసారి నిరాశే ఎదురయ్యింది. ప్రస్తుతం శ్యామిలీ పెయింటింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
