Vijay Deverakonda-Rashmika: మొదలైన పెళ్లి సందడి.. విజయ్ దేవరకొండ ఇంటి నుంచి తొలి వీడియో..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం త్వరలోనే రష్మిక మందన్నా, విజయ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 26న వీరి వివాహం ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది.

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమేనంటూ ఇటీవల వీరిద్దరి వివాహ పత్రిక నెట్టింట వైరల్ అయ్యింది. వీరిద్దరి పెళ్లి ఈనెల 26న జరుగనుంది. ఈ వేడుకకు సినీప్రముఖులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నెట్టింట విజయ్, రష్మిక పెళ్లి పత్రిక లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే విజయ్ టీమ్ స్పందిస్తూ.. నెట్టింట ఆ పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించిన వివరాలను షేర్ చేయొద్దని.. అది సరైన పద్దతి కాదని స్పష్టం చేసింది. మరోవైపు విజయ్ ఇంటి వద్ద పెళ్లి పనులు షూరు అయినట్లు తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
ఇప్పటికే విజయ్ ఇంట్లో పెళ్లి పనులు షూరు అయినట్లు తెలుస్తోంది. దేవరకొండ ఇంటి మొత్తాన్ని విద్యుత్ కాంతులతో మరింత అందంగా ముస్తాబు చేశారు. పెళ్లికి ఇంకా 7 రోజుల సమయం మాత్రమే ఉండడంతో విజయ్ ఇంట్లో వివాహానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేశారని సమాచారం. వీరిద్దరి పెళ్లి రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ సిటీ ప్యాలెస్ లో జరగనుంది. ఈ వేడుకకు అతి కొద్ది మంధి బంధువులు, ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు సమాచారం. మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక మందన్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యానిమల్, పుష్ప 2, కుభేర, థా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్న రష్మిక.. ఇప్పటికీ అటు హిందీ, ఇటు తెలుగులో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మరోవైపు కింగ్డమ్ ప్రేక్షకులను అలరించిన విజయ్. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
