Ashish Vidyarthi : పోకిరి విలన్ దంపతులకు యాక్సిడెంట్.. క్లారిటీ ఇచ్చిన ఆశిష్ విద్యార్థి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలతో పాపులర్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. అందులో ఆశిష్ విద్యార్థి ఒకరు. గుడుంబా శంకర్, పోకిరి వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ ఆశిష్ విద్యార్థి స్వయంగా వీడియో రిలీజ్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఆశిష్ విద్యార్థి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు చిత్రాలు తగ్గించాడు. అలాగే బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆశిష్ విద్యార్థి.. ఆయన భార్య రూపాలి బరూవా రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో క్లారిటీ ఇస్తూ వీడియో షేర్ చేశాడు ఆశిష్ విద్యార్థి. గువహటిలో శుక్రవారం రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన బైక్ తమను ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో తన భార్య రూపాలికి స్వల్ప గాయలయ్యాయని.. వెంటనే తమను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఆమెను పరిశీలించారని తెలిపారు. ప్రస్తుతం తామిద్దరం సురక్షితంగానే ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
ఈ ఘటనలో అటు బైకర్ కు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. తమ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తమ పై అభిమానులు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆశిష్ విద్యార్థి వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషలలోనూ ఆశిష్ విద్యార్థి పలు చిత్రాల్లో నటించారు. 2023లో రుపాలీని రెండో వివాహం చేసుకున్నారు. తనకంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడంపై కొందరు నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు. అయితే తనపై వచ్చిన విమర్శలకు ధీటుగానే స్పందించారు ఆశిష్ విద్యార్థి. తన మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నామని.. ఇప్పుడు రూపాలీతో కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
ఆశిష్ విద్యార్థి… దాదాపు 11 భాషలలో మొత్తం 300లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో పాపే నా ప్రాణం సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత గుడుంబా శంకర్, పోకిరి, తులసి, అతిథి, అలా మొదలైంది వంటి చిత్రాల్లో నటించారు. తక్కువ సమయంలోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
