AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆది పుత్ర..గంజాయి మిత్ర.. అసలు ఎమ్మెల్యే కొడుకు ఎలా పట్టుబడ్డాడు..?

పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం. ఆపుత్రుడు ఎదిగి ప్రయోజకుడైనప్పుడే ఏ తండ్రికైనా పుత్రోత్సాహం. కానీ ఏపీ అధికార కూటమికి చెందిన ఒక ఎమ్మెల్యే కొడుకేంటి ఇంత పనిచేశాడు. డ్రగ్స్‌తో అడ్డంగా దొరికాడు. ఒకసారి కాదు, రెండు కాదు, మూడు సార్లు దొరికాడు. అయినా నో చేంజ్. గంజాయ్‌తో ఎంజాయ్ చేస్తున్న తన సుపుత్రుడ్ని తండ్రి ఎందుకు దారిలోకి తెచ్చుకోలేకపోయాడు..?

Andhra: ఆది పుత్ర..గంజాయి మిత్ర.. అసలు ఎమ్మెల్యే కొడుకు ఎలా పట్టుబడ్డాడు..?
Sudheer Reddy
Ram Naramaneni
|

Updated on: Jan 03, 2026 | 9:43 PM

Share

గంజాయి కేసులో ఇరుక్కున్న సుధీర్‌రెడ్డి.. ఇలా చెబితే ఏదో నార్మల్ కేసులా అనిపిస్తుంది.. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సుధీర్‌రెడ్డి గంజాయి కేసులో ఇరుక్కున్నాడంటే.. పొలిటికల్‌గా సెగలు కక్కదా. ఇప్పుడదే జరుగుతోంది ఏపీ రాజకీయంలో. సుధీర్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారాల పుత్రుడు. అది కూడా అధికారకూటమిలో కీలక సభ్యుడిగా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన చరిత్ర కూడా ఉంది. అలాంటి నేత కొడుకు ఇప్పుడు గంజాయి మత్తులో తూలుతున్నాడు.

పోనీ మొదటిసారి..పిలకాయ ఏదో గాడితప్పినాడు అనుకుందామన్నా కుదరదు. ఎందుకంటే ఈయన దొరకడం ఇదే మొదటిసారి కాదు. రెండోసారి కాదు. మూడోసారి. అంటే డ్రగ్స్ మత్తులో ఈయనగారు ఎంతకూరుకుపోయాడో అర్థమవుతోందిగా. మామూలుగా రాజకీయ నేతల పిల్లలు ఇలాంటి విషయాల్లో పట్టుబడితే పేర్లు, గట్రా బయటకు రావడం చాలా అరుదు. కానీ థాంక్ గాడ్ ఈగల్ టీమ్‌కు సెల్యూట్ చేయాలి. ఒక ఎమ్మెల్యే కొడుకును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా డీ అడిక్షన్ సెంటర్‌కు కూడా పంపారు. అతడి మత్తు వ్యవహారం లోకానికి తెలిసేలా చేశారు.

ఈయనగారు ఎలా దొరికాడో ఒకసారి ఆరా తీస్తే..ఈగల్‌టీమ్‌కు పక్కా సమాచారంతో హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో దాడులు నిర్వహించింది. ఆసమయంలో సుధీర్‌రెడ్డితో పాటు 17మంది ఉన్నారు. సుధీర్‌ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయగా గంజాయి పాజిటివ్ తేలింది. పోనీ దొరికాడు గమ్ముగున్నాడా లేదు..ఈగల్‌ టీమ్‌తో చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేశాడని తెలుస్తోంది. మత్తులో అలా చేశాడా..లేక ఆయనగారి స్వభావం అంతేనా..అన్నది తెలియదు కానీ, ఒక ప్రజాప్రతినిధి కొడుకు ఇలా వ్యవహరించడం మాత్రం ప్రజలకు మింగుడుపడడంలేదు. ఇప్పుడిదే పాయింట్‌ మీద రాజకీయ ప్రత్యర్ధులు నిగ్గదీసి అడుగుతున్నారు. గంజాయి బ్యాచ్‌లో మునిగిన కూటమి ప్రభుత్వ ఎమ్మల్యే కొడుకు అంటూ హెడ్‌లైన్స్ పెట్టి, రాజకీయంగా చాకిరేవుపెడుతున్నారు.

కొడుకు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం ప్రయోజకుడై నలుగురిలో మంచి అనిపించుకున్నప్పుడే ఆతండ్రికి నిజమైన పుత్రోత్సాహం అంటారు. మరి తన కొడుకు గంజాయి కేసులో దొరకడం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి పుత్రోత్సాహమా..పుత్రశోకమా. అయినా ఆల్రెడీ రెండు సార్లు డ్రగ్స్ కేసుల్లోనే పట్టుబడ్డ కొడుకు గురించి తండ్రికి తెలియకుండా ఉంటుందా..? కొడుకు డ్రగ్ ఎడిక్ట్ అని తెలిసినా, నా కొడుకు అన్న భావనతో ఎమ్మెల్యేగారు చూసీ చూడనట్లు వదిలేశారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.

మొత్తానికి 45రోజుల పాటు డీ అడిక్షన్ సెంటర్లోనే ఉండబోతున్న సుధీర్‌రెడ్డిని చూసి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఎలా ఫీలవుతాడో తెలియదు కానీ, ఏపీ ప్రజలు మాత్రం తలబాదుకుంటున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ కుటుంబం, ఇలా దారి తప్పిందేంటి అన్న ఆందోళనతో జనాలు తెగ ఫీలవుతున్నారట. ఏం ఆదినారాయణరెడ్డి సాబ్..కొడుకును దారిలోకి తెచ్చుకోలేకపోతున్నారా..లేక కొడుకు దారిలోనే మీరూ నడుస్తున్నారా అంటూ ప్రత్యర్ధులే కాదు ప్రజలు కూడా అడుగుతున్న పరిస్థితి.

రూ.కోట్ల ఆస్తి.. విదేశాల్లో లగ్జరీ లైఫ్! టాలీవుడ్‌ హీరోయిన్ ఎవరు?
రూ.కోట్ల ఆస్తి.. విదేశాల్లో లగ్జరీ లైఫ్! టాలీవుడ్‌ హీరోయిన్ ఎవరు?
ఏపీ రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి అప్పుడే
ఏపీ రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి అప్పుడే
ముఖంపై ఎప్పుడూ విచారమేనా? సైకాలజిస్ట్​లు చెబుతున్న షాకింగ్ నిజాలు
ముఖంపై ఎప్పుడూ విచారమేనా? సైకాలజిస్ట్​లు చెబుతున్న షాకింగ్ నిజాలు
తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి!
తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి!
బెబో ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? రివీల్ చేసిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్
బెబో ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? రివీల్ చేసిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్
ఆహార అలవాట్ల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్
ఆహార అలవాట్ల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్
గ్రోక్‌ను పిచ్చిపిచ్చిగా వాడే వారిని వదిలిపెట్టం..!
గ్రోక్‌ను పిచ్చిపిచ్చిగా వాడే వారిని వదిలిపెట్టం..!
Horoscope Today: వారికి కీలక వ్యవహారాల్లో విజయం పక్కా..
Horoscope Today: వారికి కీలక వ్యవహారాల్లో విజయం పక్కా..
బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ 5 కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న..
బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ 5 కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న..
వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఏ రోజుల్లో
వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఏ రోజుల్లో