AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Transit: నేటి నుంచి 138 రోజుల పాటు తిరోమనంలో శనీశ్వరుడు.. ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..

నవ గ్రహాల్లో శనీశ్వరుడు కర్మ ఫలదాత. న్యాయాధిపతి. మందగమనుడైన శనీశ్వరుడు ఈ రోజు (జూలై 13)నుంచి తిరోగమనంలో పయనించనున్నాడు. మీనరాశిలో తిరోగమనంలో ఉండనున్న శనీశ్వరుడు నవంబర్ 28 వరకు అదే స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో అన్ని రాశులపై ప్రభావం చూపించనుండగా.. కొన్ని రాశులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కనుక ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Saturn Transit: నేటి నుంచి 138 రోజుల పాటు తిరోమనంలో శనీశ్వరుడు.. ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
Lord Shani Dev
Surya Kala
|

Updated on: Jul 13, 2025 | 8:27 AM

Share

జ్యోతిషశాస్త్రంలో శనిని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు.అయితే అది నిజం కాదు. శనీశ్వరుడు న్యాయ దేవుడు. ఎల్లప్పుడూ మనిషి చేసిన కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. మనం ఏ పనులు చేసినా, అది మంచిదైనా, చెడుదైనా.. వాటికి అనుగుణంగా ఫలితాలను శని ద్వారానే పొందుతాము. అయితే ఈ రోజు శనీశ్వరుడు మీనరాసిలో తిరోగమనంలో ఉండనున్నాడు. ఈ నేపధ్యంలో కొన్ని రాశులు ఈ సమయంలో విజయం సాధిస్తాయి. కొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

శనీశ్వరుడు తిరోగమనం ఎలా ఉంటుంది? జూలై 13 నుంచి 138 రోజుల పాటు శనీశ్వరుడు తిరోగమనంలో ఉండబోతున్నాడు. అన్ని గ్రహాలు సంచరిస్తాయి. అయితే శనీశ్వర సంచరించినప్పుడు మాత్రం మనిషి జీవన విధానాన్ని, ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. జీవితపు విధిని, వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ పునరాలోచించుకోవాల్సిన సమయం ఇది. ఇది స్వీయ అవగాహన సమయం. కనుక శనీశ్వర దృష్టి నుంచి నివారణలు, లేదా శనీశ్వరుడు అంటే భయపడటం కంటే, ప్రతి ఒక్కరూ అంతర్గత ధ్యానం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనసుని శుద్ధి చేసుకునే సమయం.

శనీశ్వరుడు తిరోగమనంలోకి మారినప్పుడు ఏమి జరుగుతుందంటే జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు కఠినమైన గ్రహంగా పరిగణిస్తారు ఎందుకంటే శనీశ్వరుడు క్రమశిక్షణ, అంకితభావం, కృషి, కర్మ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. శనీశ్వరుడు స్థితి అంటే మన జీవితాన్ని దాని నిజమైన రూపంలో గుర్తించాలి.

ఇవి కూడా చదవండి

శనీశ్వరుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీన రాశి చివరి రాశిగా పరిగణించబడుతుంది. ఇది ఆధ్యాత్మికత, అంకితభావానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. మీన రాశిని బృహస్పతి పాలిస్తాడు. మీనం భావోద్వేగ అనుబంధానికి సంకేతం. మన చర్యల ఫలితాలను మనకు వివరించే గురువు. ఈ సమయంలో మీ చర్యలకు తగిన ఫలితాలు వేగవంతం అవుతాయి. మీ పనులు మంచిగా ఉంటే మీకు అదే ఫలితం లభిస్తుంది. మీ పనులలో ఏవైనా తప్పులు ఉంటే దాని ఫలితాన్ని పొందుతారు.

ఏలినాటి శని, ధైయా, శని దశ లేదా మహాదశ ఏలినాటి శని, ధైయ, దశ లేదా మహాదశ వంటి వాటితో ఇబ్బంది పడే వ్యక్తులు ఈ సమయంలో తమ కర్మల ప్రభావాలను త్వరగా, వేగంగా అందుకుంటారు. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు తిరోగమనంలో ఉంటే, వారు తమ కర్మలను చేయడానికి ఇది సమయం. కనుక ఎవరైనా కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే.. అప్పుడు పెండింగ్ పనిని కూడా పూర్తి చేయవచ్చు.

తులా రాశి: తుల రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తుల రాశి వారు ఏ పని మొదలు పెట్టినా విజయం లభిస్తుంది, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావచ్చు లేదా ధన ప్రయోజనాలు పొందవచ్చు.

మీన రాశి: ఈ రాశికి వారికి సమయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటాలి. ఎందుకంటే శనీశ్వర గుణాలు విరుద్ధంగా ఉండే మీన రాశి లక్షణాలతో ఘర్షణ పడతాయి. అటువంటి పరిస్థితిలో వీరి జీవితంలో కొంత గందరగోళం నెలకొంటుంది. వీరి జీవితం ఈ సమయంలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి కలగవచ్చు.

శని గ్రహ తిరోగమనంలో ఎలాంటి పరిహారాలు ఫలవంతం అంటే

  1. అన్ని రాశుల వారు శనీశ్వరుడు తిరోగమనానికి ఒకే విధంగా పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయం కర్మలకు ఫలితాలు వచ్చే సమయం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని నియంత్రించుకోవాలి.
  2. జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోవాలి.
  3. అన్ని పనులకు ఒక నియమం, సమయాన్ని నిర్ణయించుకోవాలి.
  4. వ్యాయామం, ఆధ్యాత్మికతకు కొంత సమయం కేటాయించుకోవాలి.
  5. ఈ సమయంలో ఏ పనిని వాయిదా వేయకండి. ఏ పని చేయవలసి వచ్చినా ఆ సమయంలోనే చేయండి. ఎవరినైనా కలవవలసి వస్తే, సరైన సమయంలో కలవండి, ఆలస్యం చేయకండి.
  6. తినడానికి, నిద్రించడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకోండి.
  7. అలాగే మీ కింది అధికారులతో బాగా వ్యవహరించండి.
  8. ఈ సమయంలో క్రమశిక్షణ మీ అతిపెద్ద బలం కావచ్చు.
  9. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కష్టపడి, శ్రద్ధగా పని చేయాలి. ఏ పనిని అసంపూర్ణంగా వదిలివేయవద్దు.
  10. ఈ సమయంలో హనుమంతుడిని పూజించడం ఫలవంతం. ఓం శనిశ్చరాయ నమః కూడా జపించవచ్చు.
  11. ఈ సమయంలో శివుడిని కూడా పూజించవచ్చు. శివ పూజ ప్రయోజనం చేకూరుస్తుంది.
  12. పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..