- Telugu News Photo Gallery Marriage is possible for people of five zodiac signs due to saktivantamaina Raja Yoga
500 ఏళ్ల తర్వాత అద్భుతం.. వివాహం జరగనున్న రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది చాలా సహజం. నెలకు ఒకసారి గ్రహాలు నక్షత్రాలు లేదా రాశుల నుంచి సంచారం చేయడం జరుగుతుంది. కాగా, దీని ప్రభావం 12 రాశులపై పడగా కొన్ని రాశుల వారికి ఈ సంచారం అనేది కలిసి వస్తుంది. అయితే ఐదవందల ఏళ్ల తర్వాత గ్రహాల సంచారం, కలయిక వలన శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుందంట. దీని వలన ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతంది.
Updated on: Jul 13, 2025 | 1:59 PM

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈరోజులు కలిసి వస్తాయంట. ఖర్చు పెరిగిపోతుంది. కానీ ఇది భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉండటంతో వీరు చాలా ఆనందంగా గడుపుతారు. వీరి వలన కుటుంబంలో సంతోషాలు విల్లి విరుస్తాయి. కుటుంబంతో, మీ భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. పట్టిందల్లా బంగారమే కానుంది.

సింహ రాశి : సింహరాశి వారికి శక్తి వంతమైన రాజయోగం వలన త్వరలో వివాహం జరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరు వ్యాపారంలో అత్యధిక లాభాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఈ రాజయోగం సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుందంట. పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

మీన రాశి : మీన రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే, భార్యభర్తల మధ్య సమస్యలు తొలిగిపోతాయి.వీరు ఎంత కష్టతరమైన పనులైనా సరే రాహువు అనుగ్రహంతో చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎలాంటి అనారోగ్యసమస్యలు దరి చేరవు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. అప్పుల బాధలు తొలిగిపోతాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ అందడంతో చాలా ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి : మిథున రాశివారికి కోరుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే చాలా రోజులుగా ఎవరైతే ఏదైనా నూతన వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారు ఈ సమయంలో కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. అదే విధంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు కూడా, త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉన్నదంట.



