- Telugu News Photo Gallery Risk of jaundice during the monsoon season, keep your health safe with these foods
Jaundice: వర్షాకాలంలో జాండీస్ వచ్చే ప్రమాదం.. ఈ ఆహారాలతో ఆరోగ్యం భద్రం..
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాగునీరు కలుషితం కావడం సర్వసాధారణం. ఈ కాలంలో పొరపాటున వ్యాధి సోకిన నీటిని తీసుకున్న మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావం చూపుతుంది. వర్షాకాలంలో కామెర్లు వచ్చి అవకాశం అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏ బాక్టీరియా, వైరస్ త్వరగా ప్రభావితం కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీటిని ఆరోగ్యంగా ఉంచాలంటే ఎలాంటి మందులు తీసుకోవలసిన పని లేదు మంచి ఆహారం తీసుకుంటే చాలు.
Updated on: Jul 13, 2025 | 2:30 PM

కిడ్నీని ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతీయ వంటల్లో ఉపయోగించే కొన్ని ఆయుర్వేద మూలికలను ఉపయోగిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వర్షాకాలంలో వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మూత్రపిండాల కోసం పసుపు: మీ రోజువారీ ఆహారంలో పసుపు పొడితో చేసిన చట్నీని తీసుకోండి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్‌లు, కర్కుమిన్ అనే సమ్మేళనం కారణంగా శరీరంలో వాపు, నొప్పిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేస్తుంది.

అయితే, ఎవరికైనా కామెర్లు వస్తే చికిత్స సమయంలో పసుపును తీసుకోవలసిన అవసరం లేదు. దీనికి వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతిరోజూ ఆహారంలో పసుపును తీసుకోవాలి. ఇది కామెర్లు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది. వర్షకాలంలో భోజనం తర్వాత, మంచినీటిలో పసుపు కలిపి తీసుకోండి. ఇలా రోజుకు ఒకసారి మాత్రమే చేయండి.

అల్లం రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేసి, జుట్టును బలంగా, ఒత్తుగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ సహజ ఔషధాన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం మంచిది.

అధిక రక్తపోటు ఉన్నవారికి వెల్లుల్లి బెస్ట్ మెడిసిన్. వెల్లుల్లి సారం సప్లిమెంట్లు రక్తపోటును అలాగే మందులను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఉన్నవారు రోజుకు మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా వారి చక్కెర స్థాయిలను క్రమంగా సమతుల్యం చేసుకోవచ్చు.




