Lucky Horoscope: మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..!
కుజ, రాహువులు ఎక్కడ కలిసినా ఆ కాంబినేషన్ పట్టువదలని విక్రమార్కులను సృష్టిస్తుంది. ఈ నెల 24 నుంచి మీన రాశిలో రాహువును కలవబోతున్న కుజ గ్రహం వల్ల కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు, బకాయిలు వసూల వుతాయి. డాక్టర్లకు, లాయర్లకు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.
కుజ, రాహువులు ఎక్కడ కలిసినా ఆ కాంబినేషన్ పట్టువదలని విక్రమార్కులను సృష్టిస్తుంది. ఈ నెల 24 నుంచి మీన రాశిలో రాహువును కలవబోతున్న కుజ గ్రహం వల్ల కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు, బకాయిలు వసూల వుతాయి. డాక్టర్లకు, లాయర్లకు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. కొన్ని రాశులవారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. సాహసాలకు ఒడిగడతారు. ఈ కుజ, రాహువుల యుతి జూన్ 1 వరకు కొనసాగుతుంది. వృషభం, మిథునం, తుల, థనుస్సు, మకరం, మీన రాశుల వారికి ఈ కలయికతో అనేక విధాలుగా అదృష్టం పండుతుంది.
- వృషభం: ఈ రాశికి లాభస్థానంలో కుజ, రాహువులు కలుస్తున్నందువల్ల ఈ నెల 24 నుంచి వీరి జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం బాగా అనుకూలిస్తుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయ త్నంతో చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ, రాహువులు కలుస్తున్నందువల్ల పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు వగైరాల్లో ఈ రాశివారు ఘన విజయాలు సాధిస్తారు. లాయర్లకు వాదోపవాదాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. డాక్టర్ల హస్తవాసి వెలుగులోకి వస్తుంది. ఎటువంటి శస్త్ర చికిత్స అయినా విజయ వంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాతో పాటు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన ఆఫర్లు వస్తాయి.
- తుల: ఈ రాశివారిలో యాంబిషన్ పెరుగుతుంది. దేన్నయినా సాధించాలన్న తపన ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఎటువంటి పోటీ ఉన్నప్పటికీ మొండి పట్టుదలతో ప్రయత్నాలు సాగించి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశ ముంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలను సాధించుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ, రాహువుల యుతి వల్ల గృహ, వాహన సౌకర్యాలను ఏర్పరచు కోవడం, మెరుగుపరచుకోవడం వంటివి జరుగుతాయి. పదోన్నతులను, భారీ జీతభత్యాలను పట్టు దలగా సాధించుకుంటారు. రాజీమార్గంలో ఆస్తి వివాదాల్ని పరిష్కరించుకుంటారు. భూ సంబం ధమైన వ్యవహారాలు, ఒప్పందాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తి విలువ పెరుగు తుంది. రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.
- మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కుజ, రాహువుల కాంబినేషన్ చోటు చేసుకుంటున్నందువల్ల, కొద్ది ప్రయత్నంతో అనేక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ అతి వేగంగా పురోగతి ఉంటుంది. ఆశించిన పదోన్నతులకు అవకాశముంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశముంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులు అనుకున్నది సాధి స్తారు. విదేశీ ప్రయాణాలు జరగవచ్చు. ఏ చిన్న ప్రయత్నమైనా ఎక్కువగా సత్ఫలితాలనిస్తుంది.
- మీనం: ఈ రాశిలో కుజ, రాహువుల సంయోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారు ఏ వివాదంలో అయినా విజయాలు సాధిస్తారు. అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. బాకీలన్నీ వసూలవుతాయి.