Horoscope Today: ఆ రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో ప్రధాన లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి జీవితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు. వృషభ రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఖర్చు చేయాలి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 24 April 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 24, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో ప్రధాన లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి జీవితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు. వృషభ రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఖర్చు చేయాలి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రధాన లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి జీవితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ చాలావరకు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఖర్చు చేయాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి.ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొం టుంది. ఇంటా బయటా కొద్దిపాటి శ్రమ తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు వెడతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశముంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవు తుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటపడ తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో కొద్ది శ్రమతో సమర్థవంతంగా బాధ్య తల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తరఫు బంధు వుల రాకపోకలుంటాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబ పరిస్థితులు మెరుగ్గాఝ ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో మార్పులు చేస్తారు. ముఖ్య మైన వ్యవహారాల్లో పెద్దల నుంచి సహాయ సహకారాలుంటాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితు లుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరో గ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబపరంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలకు సంబంధించి ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పట్టుదలగా ఒకటి రెండు కీలకమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు న్నాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపో తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇంటా బయటా కొద్దిగా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలి తాలనిస్తాయి. కుటుంబపరంగా శుభవార్త అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధుమిత్రులు అండగా ఉంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యాపారాలు అంచనాలకు మించి రాణిస్తాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశముంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ప్పటికీ లాభాలకు లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఇతరులకు సహాయంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగు తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని ప్రధానమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మంచి పరి చయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడికి లోటుండదు. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా అనుకూలంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకావముంది. ముఖ్య మైన వ్యవహారాల్లో సీదా సాదాగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలుంటాయి. బంధువులతో ఇబ్బందులుంటాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..