Lord Shani Dev: కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..!
ఈ నెల 24 నుంచి కుంభ రాశి నుంచి కుజుడు మీన రాశిలోకి మారడం జరుగుతోంది. దాంతో కుంభ రాశిలో ఉన్న శనీశ్వరుడు కుజుడి నిష్క్రమణతో ఒంటరిగా మిగిలిపోవడం జరుగుతుంది. దాదాపు సంవత్సర కాలంలో ఏదో ఒక గ్రహంతో ఉన్న శనీశ్వరుడు ఇప్పుడిక ఒంటరిగా మిగిలినందువల్ల, పూర్తి స్థాయిలో తన సత్తాను చూపించే అవకాశముంది.
ఈ నెల 24 నుంచి కుంభ రాశి నుంచి కుజుడు మీన రాశిలోకి మారడం జరుగుతోంది. దాంతో కుంభ రాశిలో ఉన్న శనీశ్వరుడు కుజుడి నిష్క్రమణతో ఒంటరిగా మిగిలిపోవడం జరుగుతుంది. దాదాపు సంవత్సర కాలంలో ఏదో ఒక గ్రహంతో ఉన్న శనీశ్వరుడు ఇప్పుడిక ఒంటరిగా మిగిలినందువల్ల, పూర్తి స్థాయిలో తన సత్తాను చూపించే అవకాశముంది. మరో ఆరేడు నెలల పాటు శని ఒంటరిగానే తన స్వక్షేత్రమైన కుంభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. దీని వల్ల మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి కొన్ని శుభ యోగాలు కలిగే అవకాశముంది. ఉద్యోగాల్లో స్థిరత్వం, ఆర్థికాభివృద్ధి, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి, ఉద్యోగ లభ్యత వంటివి చోటు చేసుకునే అవకాశముంది.
- మేషం: ఈ రాశివారికి లాభస్థానంలో ఉన్న లాభ స్థానాధిపతి శనీశ్వరుడు ఈ నెల 24వ తేదీ నుంచి ఈ రాశివారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఉన్నత స్థానాలకు చేర్చడం ప్రారంభమవుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాల బాటపడతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగులకు సైతం డిమాండు పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడికి పూర్తి స్థాయిలో దిగ్బలం, శశ యోగం పట్టే అవ కాశముంది. అనేక విధాలుగా ప్రజాకర్షణ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, ఆదాయ సమస్యలు పరిష్కారం అయి, అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. మంచి పెళ్లి సంబంధం కుదరుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేర్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల బెడద తగ్గుతుంది. అవి లాభాల బాట పడతాయి. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.
- తుల: ఈ రాశికి పంచమంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఈ రాశివారికి రాజయోగాలు కలుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశముంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. రాజకీయంగా, సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి మూడవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి కారణంగా అనేక రకాలుగా ‘వృద్ధి’ ఉంటుంది. ఏ రంగంలోని వారైనా అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరు గుతుంది. ధన యోగాలు పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయ త్నాలు సఫలం అవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ఉన్న ధనాధిపతి శని అధిక ధన యోగం కలిగించే అవకాశముంది. అనేక మార్గాల్లో ధనాభివృద్ధి జరగడం వల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం, ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉండడం జరుగుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబపరంగా సుఖ సంతోషాలు అనుభవిస్తారు. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి.