Chandra Mangala Yoga: కుజ, చంద్రుల యుతి.. ఆ రాశుల వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయ వృద్ధి..!
Income Astrology: ఈ నెల 3,4,5 తేదీల్లో మేష రాశిలో కుజ, చంద్రుల యుతి వల్ల చంద్ర మంగళ యోగం అనే ఆదాయ వృద్ధి యోగం ఏర్పడుతోంది. కుజుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ యోగానికి బలం మరింత పెరిగింది. ఈ రాశుల వారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో పాటు అత్యధికంగా ఆదాయాన్ని దాచుకునే యోగం కూడా పడుతుంది.

Chandra Mangala Yoga
ఈ నెల 3,4,5 తేదీల్లో మేష రాశిలో కుజ, చంద్రుల యుతి వల్ల చంద్ర మంగళ యోగం అనే ఆదాయ వృద్ధి యోగం ఏర్పడుతోంది. కుజుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ యోగానికి బలం మరింత పెరిగింది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులకు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో పాటు అత్యధికంగా ఆదాయాన్ని దాచుకునే యోగం కూడా పడుతుంది. ఈ కారణంగానే చంద్ర మంగళ యోగాన్ని లంకె బిందెల యోగం అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఈ యోగం పట్టినవారు బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడానికి ప్రయత్నించడంతో పాటు ఆదాయాన్ని సక్రమంగా మదుపు చేయడానికి కూడా ప్రాధాన్యమిస్తారు.
- మేషం: ఈ రాశిలో కుజ, చంద్రులు కలుసుకోవడం వల్ల ఈ రాశివారికి అప్రయత్నంగా అనేక మార్గాల్లో ఆదాయం కలిసే అవకాశం ఉంటుంది. వీరి ఆదాయం పెరగడంతో పాటు కుటుంబ సభ్యుల ఆదా యాలు కూడా పెరగడం జరుగుతుంది. వీరు తమ మిగులు ఆదాయాన్ని వ్యాపారాల్లో మదుపు చేయడం గానీ, షేర్లు కొనడం గానీ జరుగుతుంది. వీరికి స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆస్తి కలిసి వస్తుంది.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడినందువల్ల ఉద్యోగంలో జీతభత్యాలు పెర గడం, అదనపు రాబడికి కూడా అవకాశాలుండడం వల్ల విశేషమైన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుని, పొదుపును పెంచే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. మిగులు ఆదాయాన్ని జాగ్రత్తగా దాచుకునే అవకాశం ఉంది. సాధారణంగా వడ్డీ వ్యాపారాలకు ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతితో చంద్రుడు కలవడం వల్ల విదేశాల్లో ఉద్యోగం సంపాదించ డానికి అవకాశముంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యో గంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. ప్రయాణాల వల్ల కూడా లాభం ఉంటుంది. ఆస్తిపాస్తుల మీద మదుపు చేసే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి సప్తమంలో కుజ, చంద్రుల యుతి చోటు చేసుకున్నందువల్ల భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. జీవిత భాగస్వామికి కూడా ధనాదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది. వీరు తమ మిగులు ఆదాయాన్ని స్థిరాస్తుల కొనుగోలుకు వినియోగించే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా జీతభత్యాలతో పాటు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంటుంది.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడినందువల్ల వీరు వృత్తి, ఉద్యోగాలు, ఆస్తుల ద్వారానే కాకుండా, స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీల వల్ల కూడా విపరీతంగా సంపాదించే అవకాశం ఉంది. ఎక్కువగా ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. విదేశీ సొమ్మును గడించే సూచనలు కూడా ఉన్నాయి. పిల్లలకు కూడా ధన యోగాలు పట్టే సూచనలు న్నాయి. వీరి ఆలోచనలు, వ్యూహాలు, ప్రయత్నాలు విజయవంతం అయి లాభాలు పొందుతారు.
- మీనం: ఈ రాశికి ధన స్థానంలో ఈ చంద్ర మంగళ యోగం ఏర్పడినందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. కుటుంబపరంగా కూడా ధనార్జన అవకాశాలు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాల మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. భూసంబంధమైన ఆస్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.



