AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhana Yoga: అయిదు గ్రహాల అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి విపరీత ధన యోగం!

Money Horoscope: సాధారణంగా ఒక రాశిలో మూడు గ్రహాలు చేరినప్పుడు ఆ రాశికి బలం కలిగి, కొన్ని రాశుల వారికి ఉత్తమోత్తమమైన ఫలితాలనివ్వడం జరుగుతుంది. అటువంటిది ఈ నెల 5,6,7 తేదీలో వృషభ రాశిలో ఏకంగా అయిదు గ్రహాలు కలవడం జరుగుతోంది. రవి, గురు, బుధ, శుక్ర గ్రహాలను చంద్రుడు కలుసుకోవడం వల్ల..

Dhana Yoga: అయిదు గ్రహాల అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి విపరీత ధన యోగం!
Money Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2024 | 8:42 PM

Share

సాధారణంగా ఒక రాశిలో మూడు గ్రహాలు చేరినప్పుడు ఆ రాశికి బలం కలిగి, కొన్ని రాశుల వారికి ఉత్తమోత్తమమైన ఫలితాలనివ్వడం జరుగుతుంది. అటువంటిది ఈ నెల 5,6,7 తేదీలో వృషభ రాశిలో ఏకంగా అయిదు గ్రహాలు కలవడం జరుగుతోంది. రవి, గురు, బుధ, శుక్ర గ్రహాలను చంద్రుడు కలుసుకోవడం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారికి విపరీతంగా ధన యోగాలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా, వృషభ రాశి చంద్రుడికి ఉచ్ఛ రాశి అయినందువల్ల తప్పకుండా ఈ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు, ప్రారంభించే పనులు అతి త్వరలో సానుకూలంగా నెరవేరే అవకాశం కూడా ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో అయిదు గ్రహాల సంచారం వల్ల అనేక మార్గాల్లో, అనేక విధాలుగా ధనా దాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ వేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు గానీ, జీవిత భాగస్వామి గానీ బాగా వృద్ధిలోకి వచ్చే సూచనలున్నాయి. బంధుమిత్రుల్లోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా మాటకు విలువ పెరుగుతుంది. రాబడిని బాగా మదుపు చేయడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశిలో అయిదు గ్రహాల సంచారం జరుగుతుండడం, ఇక్కడే రాశ్యధిపతి శుక్రుడు కూడా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లడం ఖాయంగా జరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆదాయం ఇక నుంచి దినదినాభివృద్ధి చెందుతుంది. సర్వత్రా ప్రాధా న్యం పెరుగుతుంది. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
  3. కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో అయిదు గ్రహాలు చేరడం ఒక విశేషం కాగా, రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం మరో విశేషం. వీటివల్ల ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని కోరికల్లో అధిక భాగం నెరవేరుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. తోబుట్టు వులతో విభేదాలు, వివాదాలు సమసిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపో తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు పెరుతుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు నాలుగు శుభ గ్రహాలు సంచారం చేస్తుం డడం వల్ల మహా భాగ్య యోగం పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం విముక్తి లభించే అవకాశం ఉంది. పిత్రార్జితం చేతికి అందుతుంది. విదేశీ సొమ్మును అనుభవించడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహ యోగం, వాహన యోగం వంటి యోగాలు పట్టే సూచనలున్నాయి.
  5. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో అయిదు శుభ గ్రహాలు చేరడం వల్ల మనసులోని కోరికల్లో అధిక భాగం నెరవేరే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఇప్పుడు చేపట్టే పనులు, కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్ప కుండా నెరవేరుతుంది. పిల్లలు ఆశించిన దానికి మించి వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగి, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.
  6. మీనం: వృద్ధి స్థానమైన తృతీయ రాశిలో అయిదు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగు తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. సోదర వర్గంతో సానుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా దూసుకుపోతారు.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..