Weekly Horoscope: ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు..
వార ఫలాలు (జూన్ 2 నుంచి జూన్ 8, 2024 వరకు): మేష రాశి వారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి ఈ వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. పట్టుదలతో పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. మిథున రాశి వారు వారమంతా శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకూలతలు బాగా పెరుగుతాయి.

వార ఫలాలు (జూన్ 2 నుంచి జూన్ 8, 2024 వరకు): మేష రాశి వారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి ఈ వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. పట్టుదలతో పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. మిథున రాశి వారు వారమంతా శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకూలతలు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుతం ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడి మనసుకు ఊరట కలుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలు చదువులు పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యం పాల్గొంటారు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచ నలు బాగా ఉపయోగపడతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. పట్టుదలతో పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొద్దిపాటి తిప్పట, ఒత్తిడికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం బాగా పెరుగుతుంది. అధికారులు ఆదర భావంతో వ్యవహరిస్తారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. పెట్టు బడులు పెంచడానికి ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలు జోలికి వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూల మవుతాయి. కుటుంబ పెద్దలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇతరులు మీ శ్రమను బాగా దోచుకునే అవకాశం ఉంది. కొద్దిపాటి అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహా రాల్లో జాగ్ర త్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వారమంతా శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా ఆదరణ, గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. లాభాల విషయంలో కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులతో విందు కార్యక్రమాలు, శుభ కార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారమంతా ఒక మోస్తరుగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా బాగా అనుకూలతలు పెరుగుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశముంది. ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు తప్ప మరో ప్రయోజనం ఉండకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు విసిగిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. సామాజిక కార్యకలాపాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ ప్రయ త్నాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు చిన్ననాటి స్నేహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల విష యంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూర ప్రాంతాలలో ఉంటున్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలలో మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. లాభాలకు లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి కానీ, శారీరర శ్రమ బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి జరుగుతుంది. అనవసర ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల ఆశించిన సమాధానం అందుతుంది. కొత్త ప్రయత్నా లకు, కొత్త నిర్ణయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇంటా బయటా కొద్దిగా ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉంటాయి. కుటుంబపరంగా చికాకులు పెరుగు తాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగు తాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో, వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆహార, విహారాల్లోనే కాక ప్రయాణాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సొంత నిర్ణయాల మీద ఆదారపడడం మంచిది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నా లకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా ఖర్చులకు సరిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కానీ, బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగి పోతాయి. కుటుంబ వ్యయం బాగా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. కొత్త ప్రయత్నాలకు, పనులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒకటి రెండు ఇష్టమైన ఆల యాలు సందర్శిస్తారు. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. ఉద్యోగంలో సాను కూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వారమంతా సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసు కుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రుల్ని కూడా కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులకు తగ్గ లాభాలు లభిస్తాయి. కుటుంబంతో కలిసి పుణ్య క్షేత్రాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల మధ్య మధ్య శారీరక, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తికాక ఇబ్బంది పడతారు. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయా సలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందక, ముఖ్యమైన అవసరాలు ఆగిపోతాయి. సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఇక వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రతిఫలం ఉంటుంది. దగ్గర బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ఫలించడం వల్ల ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరు ద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. అనుకున్న పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి, వేధింపులకు అవకాశం ఉంది. అలవి కాని లక్ష్యాలు, అన వసర బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. మిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. అయితే ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహా రాలు, పనుల్లో తిప్పట ఎక్కువగా ఉంటుంది. కుటుంబసమేతంగా ఆలయాలు సంద ర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచన లు న్నాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల సలహాలు ఉపకరిస్తాయి.



