AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

June 2024 Horoscope: శుభ గ్రహాల అనుకూలత.. ఈ నెలంతా శక్తివంతమైన రాశులు ఇవే!

శుభ గ్రహాల అనుకూలతల కారణంగా ఈ నెలంతా శక్తిమంతంగా ఉండబోతున్న రాశులు మేషం, వృషభం, కర్కాటకం, సింహం, మకరం, కుంభం. ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృ ష్టాలు పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రముఖులుగా చెలామణీ అవుతారు.

June 2024 Horoscope: శుభ గ్రహాల అనుకూలత.. ఈ నెలంతా శక్తివంతమైన రాశులు ఇవే!
June 2024 Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 01, 2024 | 8:16 PM

Share

శుభ గ్రహాల అనుకూలతల కారణంగా ఈ నెలంతా శక్తిమంతంగా ఉండబోతున్న రాశులు మేషం, వృషభం, కర్కాటకం, సింహం, మకరం, కుంభం. ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృ ష్టాలు పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రముఖులుగా చెలామణీ అవుతారు. ప్రముఖులతో తిరుగుతారు. జీవితంలో కొన్ని సానుకూల, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక యోగాలు, అధికార యోగాలు పట్టడానికి అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశిలో ప్రస్తుతం రాశినాథుడు కుజుడు సంచారం ప్రారంభించినందువల్ల వీరికి ఏ విషయం లోనూ పట్ట పగ్గాలుండవు. లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురు, బుధ, శుక్ర గ్రహాల వల్ల వీరు ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  2. వృషభం: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో పాటు రవి, గురు, బుధులు సంచారం చేయడంతో పాటు, దశమాధిపతి శని దశమంలోనే ఉండడం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగపరంగానే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. రాజకీయ ప్రముఖు లతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వాహన యోగం పడుతుంది. సంపన్నుల స్థాయికి ఎదుగు తారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో దశమాధిపతి కుజుడు, లాభస్థానంలో లాభాదిపతి శుక్రుడితో పాటు, గురు, బుధులు కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా ఉచ్ఛస్థితికి చేరుకుం టుంది. అనేక ధన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా హోదాలు పెరుగుతాయి. ఉద్యోగ రీత్యా ప్రముఖులను కలుసుకోవడం లేదా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఒక పెద్ద సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది.
  4. సింహం: రాశినాథుడు రవి దశమ స్థానంలో బుధ, శుక్ర, గురు గ్రహాలతో కలిసి ఉండడం ఒక విశేషం కాగా, భాగ్యాధిపతి కుజుడు భాగ్య స్థానంలోనే ఉండడం మరొక గొప్ప విశేషం. ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ పని చేపట్టినా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా పడుతుంది.
  5. మకరం: ఈ రాశి అధిపతి అయిన శనీశ్వరుడు ధన స్థానంలో ఉండడం, పంచమ స్థానంలో శుభ గ్రహాలు సంచారం వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా తిరుగుండదు. అనేక విధాలుగా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగు తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని అవకాశాలు అంది వస్తాయి. భారీగా వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. ఆస్తి సమకూరుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది.
  6. కుంభం: ఈ రాశిలో రాశ్యధిపతి శని బలంగా ఉండడం వల్ల, తృతీయంలో కుజుడు, చతుర్థ స్థానంలో శుభ గ్రహాలు కలవడం వల్ల ఈ రాశివారికి ఐశ్వర్యవంతులయ్యే యోగాలు పడతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. పిత్రార్జితం అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యో గంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ముందుకు దూసుకుపోతాయి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే