Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
దిన ఫలాలు (జూన్ 3, 2024): మేష రాశి వారికి కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి వారికి ప్రయాణాల్లో ఊహించని ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దిన ఫలాలు (జూన్ 3, 2024): మేష రాశి వారికి కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి వారికి ప్రయాణాల్లో ఊహించని ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తి, వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు బాగా అను కూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ ఉంటుంది. ఉద్యోగంలో అధికా రులు భారీ లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో సాను కూలతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల పరిస్థితిలో ఉంటారు. సహాయం చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ప్రయాణాల్లో ఊహించని ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా గడిచిపోతుంది. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో డిమాండ్ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబసమేతంగా ఒకటి రెండు ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక లావదేవీలు పెట్టు కోవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
పెద్దల జోక్యంతో కలహాల కాపురం చక్కబడుతుంది. ఇష్గమైన బంధువులను ఒక శుభ కార్యంలో కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం తప్ప కుండా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కొందరు సన్నిహితుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రులతో విందు కార్య క్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనం కలిగించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి అవరోధాలుంటాయి. కొందరు బంధువులతో మాట పట్టింపులుంటాయి. ధన వ్యవహారాల్లో అను కూలతలు కొనసాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనేక రకాల ఒత్తిళ్ల కారణంగా మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఇంటా బయటా శ్రమ పెరుగు తుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కలుగు తాయి. ఉద్యోగంలో ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు మందగి స్తాయి. సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. అనుకోకుండా ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు, దైవ కార్యాల కోసం డబ్బు బాగా ఖర్చు పెడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వాహన యోగం కలుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. అనుకోకుండా హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగానికి సంబంధించిన ప్రతి వ్యవహారమూ అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల ఫలితాలుం టాయి. ఉద్యోగులకు కూడా దూర ప్రాంతం నుంచి ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయ త్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం బాగానే సాగి పోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శుభ గ్రహాల అనుగ్రహం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తలపెట్టిన పనులు అతి వేగంగా పూర్తవుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. కొన్ని శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కొందరు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు వీలైనంతగా పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ జీవితంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. నిరుద్యోగులకు కొద్దిగా ఆశా భంగం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు దాదాపు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెడతారు. ఉద్యోగ జీవితంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ బాధ్యత లను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



