AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని దోష ప్రభావాన్ని తగ్గించేందుకు శంఖపుష్పం మొక్కను ఏ దిశలో.. ఏ రోజున నాటితే శుభఫలితాలు ఇస్తాయంటే..

ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకుంటాం.. అలాంటి మొక్కలలో ఒకటి శంఖ పుష్పం మొక్క లేదా అపరాజిత మొక్క. ఎవరైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నా.. జాతకంలో శని దోషం ఉన్నా.. శని దోష ప్రభావాన్ని తగ్గించడానికి ఇంట్లో అపరాజిత మొక్కను పెంచుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అపరాజిత మొక్క(శంఖపుష్పం మొక్క) ఉంటే.. అక్కడ లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. అయితే ఈ మొక్కను సరైన దిశలో నాటి పెంచుకోవాలి.

శని దోష ప్రభావాన్ని తగ్గించేందుకు శంఖపుష్పం మొక్కను ఏ దిశలో.. ఏ రోజున నాటితే శుభఫలితాలు ఇస్తాయంటే..
Vastu Tips For Aparajita Plant
Surya Kala
|

Updated on: Jun 03, 2024 | 8:25 AM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు సానుకూల లేదా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో వాస్తు నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఇంట్లోని వస్తువుల విషయంలో మాత్రమే కాదు.. వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కలకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించింది. ఇంట్లో ఏ చెట్లు, మొక్కలు నాటడం శ్రేయస్కరం.. అదే విధంగా ఇంట్లో వాస్తు దోషాలు, పేదరికంతో ఇబ్బంది పడడానికి కారణమయ్యే నియమాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకుంటాం.. అలాంటి మొక్కలలో ఒకటి శంఖ పుష్పం మొక్క లేదా అపరాజిత మొక్క. ఎవరైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నా.. జాతకంలో శని దోషం ఉన్నా.. శని దోష ప్రభావాన్ని తగ్గించడానికి ఇంట్లో అపరాజిత మొక్కను పెంచుకుంటారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అపరాజిత మొక్క(శంఖపుష్పం మొక్క) ఉంటే.. అక్కడ లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. అయితే ఈ మొక్కను సరైన దిశలో నాటి పెంచుకోవాలి. అంతేకాదు శ్రీ మహాలక్ష్మితో పాటు అపరాజిత మొక్క శివ,విష్ణువు, శనిశ్వరుడికి చాలా ప్రియమైనది. దీనితో పాటు ఈ మొక్క ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది. అపరాజిత మొక్కను ఏ దిశలో నాటాలి? మొక్కను నాటడానికి శుభప్రదమైన రోజు ఏదో తెలుసుకోండి.

శంఖపుష్పం మొక్కను ఏ దిశలో నాటాలి వాస్తు శాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను నాటేటప్పుడు దిశను గుర్తుంచుకోవాలి. ఇది ఎల్లప్పుడూ గణేశుడు, లక్ష్మీదేవి, కుబేరుడు నివసించే దిశలో ఉంచాలి. అటువంటి పరిస్థితిలో అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నాటడం శుభప్రదం.

ఇవి కూడా చదవండి

ఇంట్లో అపరాజిత మొక్కను నాటడానికి ఉత్తమ రోజు వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం లేదా శుక్రవారం ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం శుభప్రదం. ఎందుకంటే గురువారం విష్ణుమూర్తికి ,శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ మొక్కను నాటడం సంపదను పెంచుతుంది.

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టడం శుభప్రదం వాస్తు శాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం కుడి వైపున పెంచుకోవడం ఉత్తమం. ఇలా మొక్కను పెంచుకోవడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

అపరాజిత మొక్కను ఈ దిశలో నాటకండి వాస్తు ప్రకారం శంఖపుష్పం మొక్కను ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో ఎప్పుడూ నాటకూడదు. ఇలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహం దూరం అవుతుందని నమ్మకం. అంతేకాదు సుఖ సంతోషాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు