AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pashupatinath Mandir: పశుపతినాథ్ ఆలయంలో మిస్టరీలు.. మోక్షాన్ని ఇచ్చే శివయ్య దర్శనం..

క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో సోమదేవ్ రాజవంశానికి చెందిన పశుప్రేక్ష అనే రాజు పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని చారిత్రక నమ్మకాలు ఉన్నాయి. మనం దానిని విశ్వసిస్తే, ఈ ఆలయం 13 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ పశుపతి నాథుడి లయంలోకి , పశుపతినాథుడి దర్శనానికి హిందువులు మాత్రమే వెళ్ళగలరు. హిందువులు కానివారు ఈ ఆలయంలో ప్రవేశించడంపై నిషేధం కొనసాగుతుంది

Pashupatinath Mandir: పశుపతినాథ్ ఆలయంలో మిస్టరీలు.. మోక్షాన్ని ఇచ్చే శివయ్య దర్శనం..
Pashupatinath Mandir
Surya Kala
|

Updated on: Jun 03, 2024 | 10:29 AM

Share

శివుని పశుపతినాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌లో సగంగా పరిగణించబడుతుంది. ఇది నేపాల్ రాజధాని ఖాట్మండుకు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్‌పటాన్ గ్రామంలో బాగ్మతి నది ఒడ్డున ఉన్న పశుపతినాథ్ ఆలయం. నేటికీ ఇక్కడ శివుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. అంతే కాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక రహస్యాల గురించి కథలు కథలుగా వినిపిస్తూనే ఉన్నాయి.

పశుపతినాథ్ ఆలయ చరిత్ర పశుపతి నాథ్ అనేది భోలాశంకరుడి మరొక పేరు. అంటే శివుడు నాలుగు దిక్కుల్లోనూ ఉన్నాడు. మత గ్రంథాల ప్రకారం భగవంతుడు శ్రీ పశుపతినాథ్ పరబ్రహ్మ శివుని శాశ్వతమైన రూపం. శివయ్యను పంచ వక్త్రం త్రినేత్రం అని పిలుస్తారు. ఓంకారం శివుని దక్షిణ ముఖ నోటి నుండి ‘అ’ కారం, పడమర నోటి నుండి ‘ఉ’ కారం, ఉత్తర నోటి నుండి ‘మ కారం’, తూర్పు నోటి నుండి ‘చంద్రవిందు’, ఎగువ ఈశాన్య నోటి నుంచి ‘నాద్’ రూపంలో ఉద్భవించింది. .

క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో సోమదేవ్ రాజవంశానికి చెందిన పశుప్రేక్ష అనే రాజు పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని చారిత్రక నమ్మకాలు ఉన్నాయి. మనం దానిని విశ్వసిస్తే, ఈ ఆలయం 13 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ పశుపతి నాథుడి లయంలోకి , పశుపతినాథుడి దర్శనానికి హిందువులు మాత్రమే వెళ్ళగలరు. హిందువులు కానివారు ఈ ఆలయంలో ప్రవేశించడంపై నిషేధం కొనసాగుతుంది. అయితే ఆలయ బట నుంచి వీరు చూడవచ్చు. ఆలయ గర్భగుడిలో పంచముఖి శివలింగం ఉంది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం… పశుపతినాథ్ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది.

ఇవి కూడా చదవండి

దర్శనం వల్ల జంతుజాలం నుంచి విముక్తి లభిస్తుంది.

84 లక్షల జన్మలలో సంచరించిన తర్వాత మానవ జన్మ లభిస్తుందని నమ్ముతారు. అలాగే వ్యక్తి కర్మల ప్రకారం.. అతను మళ్ళీ మిగిలిన జన్మలను ఎత్తి ఆ జీవితాన్ని గడపవలసి ఉంటుంది. అందులో ఒకటి జంతువుల రూపంలో జననం. జంతువుల జీవితం చాలా బాధాకరమైనదని, అందుకే మానవులందరూ జంతువుగా జన్మించిన తర్వాత మోక్షాన్ని పొందాలని కోరుకుంటారు. ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడని పశుపతినాథ్ ఆలయం గురించి ఒక నమ్మకం. అయితే భక్తులు శివుని దర్శనానికి ముందు నందిని దర్శనం చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా చేస్తే మృగరూపంలో పుట్టడం ఖాయమని విశ్వాసం.

ఆర్య ఘాట్ నీరు ఆర్య ఘాట్ పశుపతినాథ్ ఆలయం వెలుపల ఉంది. పురాణ కాలం నుండి.. ఈ ఘాట్ నీటిని మాత్రమే ఆలయం లోపలికి తీసుకెళ్లాలనే నిబంధన ఉంది. మరే ఇతర ప్రదేశంలో నుంచి అయినా నీటిని తీసుకుని వస్తే ఆ నీటితో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేరు.

పంచముఖి శివలింగ ప్రాముఖ్యత ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం.. ఐదు ముఖాలు విభిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోర ముఖం అని, పడమర వైపు ఉన్న ముఖాన్ని సద్యోజాత్ అని, తూర్పు,ఉత్తరం వైపు ఉన్న ముఖాన్ని తత్పురుష, అర్ధనారీశ్వరుడని అంటారు. పైకి ఉండే ముఖాన్ని ఇషాన్ ముఖ అంటారు. ఇది నిరాకార నోరు. ఇది భగవాన్ పశుపతినాథుడికి సంబంధించిన ఉత్తమ ముఖం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు