AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amul Price Hike: ఇప్పుడు అమూల్ పాలు మరింత ఖరీదైనవి.. లీటర్‌కు రెండు రూపాయలు పెంపు.. మూడు అమూల్ పాలకు వర్తింపు

అమూల్ గోల్డ్, అమూల్ తాజ్, అమూల్ శక్తి లీటర్ పాలు రెండు రూపాయల మేర పెరిగాయి. అంటే ఈ మూడు పాలల్లో ఏదైనా కొనుగోలు చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమూల్ తాజా నానా పౌచ్ ధరల్లో ఎలాంటి పెంపుదల లేదు. అంటే పాత ధరలకే ఈ పాలు లభిస్తాయి. ఈ పెరుగుదల మొత్తం దేశంలో ఏకకాలంలో జరిగింది. అమూల్ పాల పెంపు అనేది ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించినది కాదని కంపెనీ స్పష్టం చేసింది.

Amul Price Hike: ఇప్పుడు అమూల్ పాలు మరింత ఖరీదైనవి.. లీటర్‌కు రెండు రూపాయలు పెంపు.. మూడు అమూల్ పాలకు వర్తింపు
Amul Price Hike
Surya Kala
|

Updated on: Jun 03, 2024 | 7:56 AM

Share

ద్రవ్యోల్బణ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే కందిపప్పు నుంచి కూరగాయల వరకూ ధరలు పైపైకి వెళ్తుండగా.. తాజాగా పాల ధర పెరగడంతో సామాన్య ప్రజలు మరోసారి షాక్‌కు గురయ్యారు. గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమూల్ పాల ధరలను పెంచింది. ఈసారి లీటరుకు రూ.2 చొప్పున పెంచారు. జూన్ 3 సోమవారం నుంచి అంటే ఈ రోజు ఉదయం నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో లీటరు పాలకు రూ.2 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ధరల పెరుగుదల మూడు అమూల్ పాలకు వర్తిస్తుంది. అమూల్ గోల్డ్, అమూల్ తాజ్, అమూల్ శక్తి లీటర్ పాలు రెండు రూపాయల మేర పెరిగాయి. అంటే ఈ మూడు పాలల్లో ఏదైనా కొనుగోలు చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమూల్ తాజా నానా పౌచ్ ధరల్లో ఎలాంటి పెంపుదల లేదు. అంటే పాత ధరలకే ఈ పాలు లభిస్తాయి. ఈ పెరుగుదల మొత్తం దేశంలో ఏకకాలంలో జరిగింది. అమూల్ పాల పెంపు అనేది ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించినది కాదని కంపెనీ స్పష్టం చేసింది.

ఇప్పుడు అమూల్ పాలు చాలా ఖరీదైనవి

అమూల్ కొత్త ధరల ప్రకారం అమూల్ గోల్డ్ హాఫ్ లీటర్ ఇప్పుడు రూ.32 నుంచి రూ.33కి పెరిగింది. అమూల్ తాజా 500 ఎంఎల్ ధర రూ.26 నుంచి రూ.27కి పెరిగింది. అమూల్ శక్తి 500 ఎంఎల్ ఇప్పుడు రూ.29 నుంచి రూ.30కి పెరిగింది. అముల్ తాజా చిన్న ప్యాకెట్లు మినహా అన్ని పాల ధరలను లీటరుకు రూ.2 పెంచారు. అమూల్ గోల్డ్ 500 ml ప్యాక్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో రూ. 33కి అందుబాటులో ఉంటుంది. అమూల్ శక్తి ప్యాక్ రూ.30కి, అమూల్ తాజా రూ.27కి అందుబాటులో ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

అంటే ఎన్నికలకు ముందు లీటరు పాలకు రూ.64 ఉండగా.. ఇప్పుడు రూ.66 చెల్లించాల్సి వస్తోంది. ఈ పెరిగిన పాల ధర సామాన్యుల బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. అంటే ఇప్పుడు మరోసారి ద్రవ్యోల్బణ ప్రభావం సామాన్య ప్రజలపై పడబోతోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ పాల ధరలు పెరగడంతో సామాన్యులకు పెద్ద సమస్యగా మారనుంది.

దీంతో ధరలు పెరిగాయి

GCMMF చివరిసారిగా ఫిబ్రవరి 2023లో పాల ధరను పెంచింది. రైతులకు పాల ఉత్పత్తిలో ఖర్చులు రోజు రోజుకీ అధికం అవుతున్నాయని.. అలా పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేసేందుకు పాల పెంపు అవసరమని కంపెనీ చెబుతోంది. లీటరుకు రూ.2 పెరగడం అంటే 3-4 శాతం ఎంఆర్‌పి పెరుగుదల మాత్రమే.. ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువని.. మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో అమూల్ పాల ధరలను పెంచడం తప్పడం లేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది.

GCMMF ప్రకారం అమూల్ పాలసీ ప్రకారం పాలు, పాల ఉత్పత్తుల కొనుగోలుతో వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను పాల ఉత్పత్తిదారులకు అందిస్తుంది. ధరల సవరణ వలన పాల ఉత్పత్తిదారులకు లాభదాయకరంగా ఉంటుందని.. నాణ్యమైన పాల ఉత్పత్తిని కొనసాగించడంలో సహాయపడుతుందని.. అధిక పాల ఉత్పత్తి చేసే విధంగా రైతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..