రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా వచ్చిన అనకొండ.. వాహనాలు ఆగిమరీ దారి.. షాకింగ్ వీడియో వైరల్ ..
కొంతమంది మాత్రం ఎటువంటి పాములనైనా చాకచక్యంగా బంధించి అలా పట్టుకున్న పాములను సురక్షిత ప్రాంతంలో లేదా అడవుల్లో వదిలేస్తారు. ప్రస్తుతం ఒక పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారికి బహుశా గూస్‌బంప్స్ వస్తాయేమో కూడా. వాస్తవానికి.. ఈ వీడియో భారీ అనకొండకు చెందినది. ఇది చాలా పెద్దది. ఎక్కడ నుంచి వచ్చిందో..హైవే రోడ్డుపైకి చేరుకుంది.
అడవుల్లో, బొరియల్లో, పాము పుట్టల్లో ఉండాల్సిన పాములు ప్రమాదవశాత్తునో, ఆహారం కోసమో వీధుల్లోకి రావడం లేదా ప్రజల ఇళ్లలోకి ప్రవేశించడం చాలా సార్లు జరుగుతుంది. అలా పాములు జనావాసాల్లోకి వస్తే చాలు ప్రజలు చాలా భయాందోళనలు చెందుతారు. విషపు పాములైతే ఏమి చేయాలో అర్థం కాక భయంతో గందరగోళం సృష్టిస్తారు. ఒకొక్కసారి భయంతో పాములను చంపేస్తారు కూడా.. అయితే కొంతమంది మాత్రం ఎటువంటి పాములనైనా చాకచక్యంగా బంధించి అలా పట్టుకున్న పాములను సురక్షిత ప్రాంతంలో లేదా అడవుల్లో వదిలేస్తారు. ప్రస్తుతం ఒక పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారికి బహుశా గూస్‌బంప్స్ వస్తాయేమో కూడా. వాస్తవానికి.. ఈ వీడియో భారీ అనకొండకు చెందినది. ఇది చాలా పెద్దది. ఎక్కడ నుంచి వచ్చిందో..హైవే రోడ్డుపైకి చేరుకుంది.
ఓ భారీ అనకొండ రోడ్డు దాటేందుకు ఎలా ప్రయత్నిస్తుందో వీడియోలో చూడొచ్చు. కొండచిలువ రోడ్డు దాటు తున్న సమయంలో కొంతమంది యువకులు కొంచెం దూరంలో దానిని ఫాలో అవుతున్నారు. అదే సమయంలో కొండచిలువ రోడ్డు దాటడం మొదలు పెట్టింది మొదలు.. అది రోడ్డు దాటి గడ్డి దుబ్బుల్లోకి చేరుకునే వరకూ రోడ్డుమీద తమ వాహనాలను ఆపివేశారు. దీంతో కొండచిలువ పాకుతూ తన భారీ కాయాన్ని సులభంగా రహదారి దాటించి అడవిలోకి తీసుకుని వెళ్ళింది. ఇలా అనకొండను రోడ్డు దాటు తున్న సమయంలో వీడియో తీసే పనిలో నిమగ్నమై ఉన్న చాలా మంది వ్యక్తులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. ఎందుకంటే బహుశా వారు కూడా ఇంత పెద్ద పామును ఎప్పుడూ చూసి ఉండరు. అనకొండ నాలుగు మీటర్ల పొడవు, 30 కిలోల బరువు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటన బ్రెజిల్‌లోని పోర్టో వెల్హో నగరానికి సమీపంలో చోటు చేసుకుంది.
వీడియో చూడండి
Traffic on a busy road in Brazil halted after the people spotted a giant anaconda crossing the highway near the city of Porto Velho, Brazil.
The snake was about over four-meters long and weighted around 30 kilograms.pic.twitter.com/dmkBH8Vn8l
— Massimo (@Rainmaker1973) June 2, 2024
ఈ షాకింగ్ వీడియో @Rainmaker1973 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 55 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మంది వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు.
అదే సమయంలో నెటిజన్లు వీడియోను చూసిన తర్వాత వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ అనకొండ చాలా పెద్దది’ అని ఎవరో కామెంట్ చేయగా.. ‘ఇది మానవ ప్రాంతాల్లో నివసించడం ప్రమాదకరం, దానిని తిరిగి తన ప్రాంతానికి వెళ్లనివ్వండి’ అని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..