Typing With Nose : వాటే ట్యాలెంట్‌ బ్రో.. ముక్కుతో టైపింగ్.. మూడోసారి సొంత రికార్డు బ్రేక్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 44 ఏళ్ల వినోద్ కుమార్ చౌదరి మూడుసార్లు అదే విభాగంలో రికార్డ్ సాధించాడు. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో అతను 26.73 సెకన్లలో టైప్ చేసి రెండవసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈసారి చౌదరి కేవలం 25.66 సెకన్లలో ఈ ఫీట్‌ను పూర్తి చేశాడు.

Typing With Nose : వాటే ట్యాలెంట్‌ బ్రో.. ముక్కుతో టైపింగ్.. మూడోసారి సొంత రికార్డు బ్రేక్
Man Typing With Nose
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2024 | 8:42 AM

ఒక వ్యక్తి తన చేతులతో కాకుండా ముక్కుతో టైప్ చేస్తున్నాడు. అది కూడా హై స్పీడ్‌గా టైప్‌ చేస్తూ ఏకంగా గిన్నిస్‌ రికార్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. అది ఒకటి రెండు కాదు..ముచ్చటగా మూడోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. సదరు వ్యక్తికి సంబంధించిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సాధారణ టైపింగ్ వేగం నిమిషానికి 40 పదాలుగా పరిగణించబడుతుంది. అయితే, ఇతని టైపింగ్ స్పీడ్ చూస్తే ఆశ్చర్యపోతారు. చేతులతో కాకుండా ముక్కుతో టైప్ చేస్తున్న అతడు నెటిజన్లు నివ్వెర పోయేలా చేస్తు్న్నాడు.

ఈ వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రెండు రికార్డులను ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన రికార్డును తానే మూడోసారి బద్దలు కొట్టాడు. ఈ వ్యక్తి పేరు వినోద్ కుమార్ చౌదరి. అతని వయస్సు 44 సంవత్సరాలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 44 ఏళ్ల వినోద్ కుమార్ చౌదరి మూడుసార్లు అదే విభాగంలో రికార్డ్ సాధించాడు. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో అతను 26.73 సెకన్లలో టైప్ చేసి రెండవసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈసారి చౌదరి కేవలం 25.66 సెకన్లలో ఈ ఫీట్‌ను పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

GWR Xలో వీడియో ద్వారా ఇది షేర్‌ చేసారు. క్లిప్‌లో అతను తన ముక్కుతో ఇంగ్లీష్ అక్షరాలను టైప్ చేస్తున్నాడు. GWR పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది ‘మీరు మీ ముక్కుతో అక్షరాన్ని ఎంత వేగంగా టైప్ చేయగలరు..? వినోద్ కుమార్ GWR నుండి టైపింగ్ గురించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన వృత్తి టైపింగ్ కాబట్టి అందులో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నట్టుగా చెప్పాడు. అందులో తన అభిరుచిని కూడా సజీవంగా ఉంచుకోవచ్చునని భావించినట్టుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…