Ketu Effect: జాతకంలో కేతు దోషమా..! నివారణ కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..

జ్యోతిషశాస్త్రంలో కేతువును కూడా పాప గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో కేతువు దోషం ఉన్న వ్యక్తి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. కేతువు దోషం ఉన్న వ్యక్తి చెడు అలవాట్లను అలవర్చుకుంటాడు. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. జాతకంలో కేతు దోషం వల్ల కాలసర్ప దోషం కూడా ఏర్పడుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. జాతకంలో కేతు దోషం ఉన్నవారు వైడూర్యాన్ని ధరించి శాస్త్రోక్తంగా పరిహారాలు తీసుకోవాలి. ఈ రోజు కేతు దోష నివారణకు ఖచ్చితమైన పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం.

Ketu Effect: జాతకంలో కేతు దోషమా..! నివారణ కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
Ketu Effects
Follow us
Surya Kala

|

Updated on: May 28, 2024 | 11:07 AM

ఎవరి జాతకంలోనైనా కేతువు దోషం ఉన్నట్లయితే.. అష్టకష్టాలు పడతారు. కనుక కేతు దోషాన్ని పోగొట్టుకోవాలనుకుంటే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం హిందూ మతంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితం గ్రహాలపై ఆధారపడి ఉంటుంది. మనవ పురోగతి, పెరుగుదల గ్రహాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరి జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉంటే వారి జీవితం అంతా సవ్యంగా సాగుతుంది. ప్రతి గ్రహం మానవ జీవితంపై వివిధ రకాల ప్రభావాలను కలిగి ఉంటుంది. కేతు గ్రహానికి మన జీవితంలో తనదైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

జ్యోతిషశాస్త్రంలో కేతువును కూడా పాప గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో కేతువు దోషం ఉన్న వ్యక్తి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. కేతువు దోషం ఉన్న వ్యక్తి చెడు అలవాట్లను అలవర్చుకుంటాడు. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. జాతకంలో కేతు దోషం వల్ల కాలసర్ప దోషం కూడా ఏర్పడుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. జాతకంలో కేతు దోషం ఉన్నవారు వైడూర్యాన్ని ధరించి శాస్త్రోక్తంగా పరిహారాలు తీసుకోవాలి. ఈ రోజు కేతు దోష నివారణకు ఖచ్చితమైన పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం.

ఈ రెమెడీస్ తో కేతు చెడు ప్రభావాలను తొలగించుకోండి

  1. హిందూ మతంలో శ్రీ గణేశుడు కేతువుకు కారణమని భావిస్తారు, అందువల్ల కేతువు ప్రభావాలతో బాధపడే ఎవరైనా శ్రీ గణేశుడిని పూజించాలి. బుధవారం రోజున గణేశుడిని పూజించడం ద్వారా కేతువు దోషం నుండి శాంతి పొందుతారు.
  2. జాతకంలో కేతు దోషం, కేతువు ఆగ్రహానికి గురైన వ్యక్తి శనివారం ఉపవాసం ఉండాలి. ఈ దోషం పోవాలంటే 18 శనివారాలు ఉపవాసం ఉండాలి.
  3. కేతువు దోషాన్ని తొలగించడానికి, ‘ఓం ప్రాణ్ ప్రీం ప్రౌన్ సహ కేత్వే నమ:’ అనే మంత్రంలోని 5, 11 లేదా 18 సార్లు జపించడం కూడా ప్రయోజనకరం.
  4. ప్రతి శనివారం రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి పేదలకు దానం చేయండి.
  5. కేతు దోష నివారణకు దుప్పటి, గొడుగు, ఇనుము, ఉసిరి, వెచ్చదనం ఇచ్చే వస్త్రాలు, కస్తూరి, వెల్లుల్లి మొదలైన వాటిని దానం చేయడం శ్రేయస్కరం.
  6. జీవితంలో కేతు దోషం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి వైడూర్య రత్నాన్ని ధరించండి.
  7. కేతువును త్వరగా శాంతింపజేయాలనుకుంటే, ప్రతిరోజూ నలుపు తెలుపు కుక్కకు ఆహారం తినిపించండి. ఇది సాధ్యం కాకపోతే, నలుపు, తెలుపు నువ్వులను ప్రవహించే నీటిలో విడిచి పెట్టండి.
  8. శనివారం ఉపవాసం చేసి కుశ గడ్డి, దర్భలను ఒక పాత్రలో ఉంచి ఆపై నీటితో నింపి రావి చెట్టు మొదల్లో భక్తితో సమర్పించండి. ఈ చర్యలు తీసుకుంటే కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.

ఎల్లప్పుడూ అశుభ ఫలితాలు పొందుతున్నారా?

జ్యోతిష్య శాస్త్రంలో కేతు గ్రహాన్ని అశుభ గ్రహంగా పరిగణిస్తారు. అయితే కేతువు వల్ల మనిషికి ఎప్పుడూ చెడు ఫలితాలు వస్తాయని కాదు. కొందరు వ్యక్తులు కేతు గ్రహం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందుతారు ఇది ఆధ్యాత్మికత, పరిత్యాగం, మోక్షం, తాంత్రికం మొదలైన వాటికి బాధ్యత వహిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో రాహువు ఏ రాశికి యాజమాన్యం లేదు. అయితే కేతువు మీన రాశికి అధినేత. ధనస్సులో ఉచ్చ స్థితిలో ఉండి మిథునంలో క్షీణిస్తుంది. 27 రుద్రాక్షలలో, కేతువు అశ్విని, మాఘ , మూల నక్షత్రాలకు అధిపతి. ఇది నీడ గ్రహం. వేద గ్రంధాల ప్రకారం, కేతు గ్రహం స్వర్భాను అనే రాక్షసుడి మొండెం. అయితే దీని తల భాగాన్ని రాహువు అంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం