- Telugu News Photo Gallery Digestion Problem: Add these food Improve your digestion system a healthy digestion
అజీర్ణం, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..! తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..
ప్రస్తుతం జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. తినే ఆహారం నుంచి నిద్రపోయే సమయం వరకూ అనేక రకాల మార్పులు చోటు చేసుకోవడంతో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది అజీర్ణం, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారే.. ఈ సమస్యను పరిష్కరించడానికి తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ 7 రసాలను క్రమం తప్పకుండా తాగాలి. ఇలా కొన్ని రసాలను తాగడం ద్వారా జీర్ణ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రసాలను తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
Updated on: May 28, 2024 | 10:38 AM

చాలామంది కడుపుకు సంబంధించిన రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో రోజులు గడుపుతున్నారు. రోజు మందులు వాడినా ఈ సమస్య పూర్తిగా తొలగిపోదు. అయితే తినే ఆహారంలో కొన్నిటిని చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్య నుంచి బయటపడవచ్చు. వీటిని తినండి.. జీర్ణ సమస్యల నుంచి బయటపడండి.

కొంబుచా రసం జీర్ణక్రియకు గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఈ జ్యూస్ జీర్ణక్రియతో పాటు ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

జీవక్రియ సోంపు కూడా బెస్ట్ మెడిసిన్. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. జడఫైబర్ జీర్ణమైన ఆహారానికి అతుక్కొని పేగు కదలికలకు తోడ్పడుతుంది. పెద్దప్రేగును ఆరోగ్యంగా ఉంచుతుంది.

కలబంద రసం కూడా కడుపుకు చాలా మంచిది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌తో బాధపడేవారు ఈ జ్యూస్‌లో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

కడుపు తేలికగా ఉంచడానికి చియా సీడ్ వాటర్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదు. ఇది డిటాక్స్ వాటర్ లాగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.

జీలకర్ర కడుపుకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియకు సంబంధించి జీలకర్ర శక్తివంతమైన జీర్ణ ఔషధం. పేగుల నిర్విషీకరణతో పాటు, పేగులలో మంచి సూక్ష్మజీవుల వృద్ధికి సహాయపడుతుంది. జీర్ణ శక్తిని పెంచడంతో పాటు జీర్ణ వ్యవస్థను చల్లగా ఉంచుతుంది.

మెంతులు సహజమైన జీర్ణక్రియలా పనిచేస్తాయి. మెంతులు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడతాయి. ఆరోగ్యానికి చాలా మంచివి.




