AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Updates: గోదావరిలో రక్తపాతం.. అమరన్ సినిమా ముచ్చట్లు..

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్‌ విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం మనం సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తైంది. వేదిక, మంచులక్ష్మి, రాహుల్‌ విజయ్‌, అజయ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ యక్షిణి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా  రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ టైసన్ నాయుడు. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా రాజ్‌కుమార్‌ పెరియసామి తెరకెక్కిస్తున్న సినిమా అమరన్.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: May 29, 2024 | 8:00 AM

Share
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో విశ్వక్ సేన్ 2.0 కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈయనకున్న మాస్ ఇమేజ్ ఈ సినిమాతో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. మే 31న విడుదల కానుంది ఈ చిత్రం. నేహా శెట్టి, అంజలి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

1 / 5
 అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం మనం సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తైంది. అందులో నాగార్జున, నాగ చైతన్య కూడా నటించారు. ఈ సందర్భంగా మనం సినిమా తాలూకు జ్ఞాపకాలు అభిమానులతో పంచుకోవడమే కాదు.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో మనం సినిమాను ఎక్కడెక్కడ షూట్ చేసారో ఓ స్పెషల్ వీడియోలో చూపించారు నాగ చైతన్య.

2 / 5
వేదిక, మంచులక్ష్మి, రాహుల్‌ విజయ్‌, అజయ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ యక్షిణి. ఈ సిరీస్‌ని భారీ నిర్మాణ విలువలతో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. జూన్ 14 నుంచి ప్రముఖ ఓటిటిలో యక్షిణి వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

3 / 5
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ టైసన్ నాయుడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా టైసన్ నాయుడు రెండో షెడ్యూల్ రాజస్థాన్‌లో మొదలైంది. 2 వారాల పాటు అక్కడే కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు దర్శక నిర్మాతలు.

4 / 5
శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా రాజ్‌కుమార్‌ పెరియసామి తెరకెక్కిస్తున్న సినిమా అమరన్. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. కాశ్మీర్ సహా ఇండియాలోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజ్ కుమార్. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.

5 / 5