AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monthly Horoscope: ఈ రాశి వారికి వచ్చే నెలలో ఉద్యోగం రావడం ఖాయం.. జూన్‌ నెల రాశి ఫలాలు..

మే నెల పూర్తికావొస్తోంది. 2024 క్యాలెండర్‌లో మరో నెల ముగిసిపోతోంది. మరి వచ్చే కొత్త నెలలో రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయమే. మరి జూన్‌ నెలలో కుంభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండనున్నాయి.? ఈ నెలలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.? ఎలాంటి సానుకూల...

Monthly Horoscope: ఈ రాశి వారికి వచ్చే నెలలో ఉద్యోగం రావడం ఖాయం.. జూన్‌ నెల రాశి ఫలాలు..
Horoscope
Narender Vaitla
|

Updated on: May 27, 2024 | 11:52 PM

Share

మే నెల పూర్తికావొస్తోంది. 2024 క్యాలెండర్‌లో మరో నెల ముగిసిపోతోంది. మరి వచ్చే కొత్త నెలలో రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయమే. మరి జూన్‌ నెలలో కుంభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండనున్నాయి.? ఈ నెలలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.? ఎలాంటి సానుకూల అంశాలు ఉండనున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం..

కుంభరాశి వారికి జూన్‌ నెల కెరీర్‌ పరంగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. కేవలం వృత్తిపరంగానే కాకుండా వ్యాపారాల్లో కూడా ఆశించిన స్థాయిలో పురోగతిని పొందుతారు. మీరు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ సమయంలో మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇక వ్యాపారాల్లోనూ మంచి లాభాలు ఆర్జిస్తారు. గతంలో కొనుగోలు చేసిన భూములకు మంచి డిమాండ్‌ ఉంటుంది.

ఇక జూన్‌ నెలలో కుంభ రాశి వారి ప్రేమ సంబంధాలు, స్నేహా బంధాలు అనుకూలంగా ఉంటాయి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి, మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్థాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. కుంభ రాశి వారికి కడుపు నొప్పి సమస్య వేధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కుంభ రాశి వారు జూన్‌ నెలలో ఇతరులతో మాట్లాడే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్ఉతన్నారు. మీ గొప్పతనం గురించి, మీరు సాధించిన విజయాల గురించి ఇతరులను చులకనగా చూడడం మంచిది కాదు, దీనివల్ల బంధాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక జూన్‌ మూడవ వారంలో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే మంచిదని చెబుతున్నారు. కెరీర్‌తో పాటు వ్యాపారానికి సంబంధించి నిర్ణయం తీసుకునే సమయంలో ఆచితుచి వ్యవహరించాలని చెబుతున్నారు. జూన్ చివరి వారంలో ఆఫీసుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండడం మేలు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం జ్యోతిష్య పండితుల అభిప్రాయం, వారి సూచనల మేరకు అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.