Budha Gochar: వృషభ రాశిలోకి బుధ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి భాగ్య యోగాలు పక్కా..!

జూన్ 1వ తేదీన మేష రాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశించబోతున్న బుధ గ్రహం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బుద్ధి కారకుడైన బుధుడు వృషభ రాశిలో జూన్ 14 వరకూ కొనసాగడం జరుగుతుంది. బుధుడు ఈ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి...

Budha Gochar: వృషభ రాశిలోకి బుధ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి భాగ్య యోగాలు పక్కా..!
Budha Gochar 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 27, 2024 | 5:17 PM

జూన్ 1వ తేదీన మేష రాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశించబోతున్న బుధ గ్రహం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బుద్ధి కారకుడైన బుధుడు వృషభ రాశిలో జూన్ 14 వరకూ కొనసాగడం జరుగుతుంది. బుధుడు ఈ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశులకు భాగ్య యోగాలు పట్టడం ప్రారంభం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం కావడం, జీతభత్యాలు, రాబడి, లాభాలు పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడి ప్రవేశం వల్ల అనేక విధాలుగా ధన లాభం కలుగుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని పెంచుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ధన స్థానంలో బుధుడి సంచార సమయంలో తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెండింతలవుతాయి. ఉద్యో గంలో కూడా ప్రతిభకు సరైన గుర్తింపు లభించి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశిలో బుధుడు ప్రవేశించినందువల్ల డబ్బు సంపాదించాలనే పట్టుదల పెరుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగి, జీతభత్యాలు ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందు తాయి. ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. మరింత మెరుగైన ఉద్యోగంలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో బుధ గ్రహ సంచారం వల్ల తప్పకుండా మహా భాగ్య యోగం కలుగు తుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా భారీ జీతభత్యాలతో కూడిన అవకాశాలు అంది వస్తాయి. జీవితానికి సంబంధించి, ఆదాయ వృద్ధికి సంబంధించి కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఖర్చులు తగ్గించి, పొదుపును పాటించడం జరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధ సంచారం వల్ల ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా కొన్ని శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు జీతభత్యాలు కూడా బాగా వృద్ధి చెందడానికి అవకాశముంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
  5. మకరం: ఈ రాశికి పంచమ కోణంలో బుధుడు ప్రవేశించడం వల్ల ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా, ప్రణాళిక అయినా తప్పకుండా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభించి, డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగు లకు సైతం మంచి ఆఫర్లు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలుంటాయి.
  6. కుంభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు నాలుగవ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలోనే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగు తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది.