Money Horoscope 2024: బలమైన స్థితిలో ధనాధిపతి.. ఈ రాశుల వారికి ఇక ఆర్థికంగా తిరుగుండదు..!
ఏ రాశుల వారి ధనాధిపతి బలంగా ఉంటే ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరికి సునాయాసంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ప్రస్తుత గోచారం ప్రకారం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు ధనాధిపతి, అంటే ద్వితీయ స్థానాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది ఈ రాశుల వారికి ఆదాయం క్రమంగా పెరుగుతూ, కొత్త ఆదాయ మార్గాలు అందివస్తూ, ఆర్థిక పరిస్థితి మెరుగైన స్థితికి చేరుకుంటుంది.
ఏ రాశుల వారి ధనాధిపతి బలంగా ఉంటే ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరికి సునాయాసంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ప్రస్తుత గోచారం ప్రకారం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు ధనాధిపతి, అంటే ద్వితీయ స్థానాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది ఈ రాశుల వారికి ఆదాయం క్రమంగా పెరుగుతూ, కొత్త ఆదాయ మార్గాలు అందివస్తూ, ఆర్థిక పరిస్థితి మెరుగైన స్థితికి చేరుకుంటుంది.
- మేషం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన శుక్రుడు ధన స్థానంలోనే ఉండడం, పైగా ధన కారకుడైన గురువుతో కలిసి ఉండడం వల్ల కొద్ది ప్రయత్నంతో అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. అతి సాధారణ వ్యక్తి కూడా ధనవంతుడు అవడానికి అవకాశం ఉంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి ధనాధిపతి అయిన రవి లాభ స్థానంలో గురు, శుక్రులతో కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారు ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. సొంత ఆదాయంతో పాటు జీవిత భాగస్వామి ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బ డిగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
- కన్య: ఈ రాశివారికి ధనాధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో, అందులోనూ స్వస్థానంలో ఉండడం, దానితో ధన కారకుడైన గురువు కలిసి ఉండడం వల్ల విశేష ధన లాబానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాకుండా ప్రభుత్వ మూలకంగా కూడా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అతి తక్కువ స్థాయి వ్యక్తులు సైతం ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్లడం జరుగుతుంది. లాభదాయక పరిచయాలు కారణంగా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. వారసత్వ సంపద కూడా సంక్రమిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి ధనాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో శుక్ర, రవులతో కలిసి ఈ రాశిని వీక్షిస్తుండడం వల్ల విశేషమైన ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అంచనాలకు మించిన ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలతో పాటు అదనపు రాబడి కూడా అనేక రెట్లు పెరగడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు రెండింతలు పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు.
- మకరం: ఈ రాశివారికి ధనాధిపతి శని ధన స్థానంలోనే, స్వక్షేత్రంలో ఉండడం, ఈ రాశిని ధన కారకుడైన గురువు పంచమ కోణం నుంచి వీక్షించడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. సగటు మనిషి సైతం ధనపరంగా ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది. ఉద్యోగంలో ఆదాయం పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి వృద్ధి చెందడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి దక్కుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది.
- మీనం: ఈ రాశికి ధనాధిపతి అయిన కుజుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వీరికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా ధన లాభం కలు గుతుంది. అనేక మార్గాల్లో ధన వృద్ధికి అవకాశం ఉంది. భూమి క్రయ విక్రయాల ద్వారా కూడా వీరికి అదృష్టం పండుతుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశముంది.