Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా విజయం, ధన లాభం.. సోమవారం రాశిఫలాలు ఇలా..
ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యో గాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఏ వ్యవహారమైనా సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. కొందరు మిత్రులుప్రతి వ్యవహారంలోనూ చేయూత నందిస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ప్రయత్నంతో ఆశించిన స్థాయి లాభాలు పొందుతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఇంటా బయటా సానుకూల వాతా వరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఒకటి రెండు సమస్యల నుంచి, కొన్ని ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కుటుంబ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి పరిచ యా లేర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుం డదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆర్థికపరంగా బాగా పురోగతి చెందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఇతరులకు సహాయం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గి ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగు తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నిరుద్యోగుల ప్రయ త్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేయడం అవసరం. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవు తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఏ వ్యవహారమైనా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధువుల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ముందుకు దూసుకుపోతాయి. ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో శుభ కార్యంలో పాల్గొం టారు. ఆస్తి వివాదం చాలావరకు పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రతి పనీ సకాలంలో పూర్తి అవుతుంది. చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగు తుంది. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కావచ్చు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో అధికారాలు పంచుకుంటారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు తేలికగా నెరవేరుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం బాగుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఏ ప్రయత్నం తలపెట్టినా లాభసాటిగా నెరవేరుతుంది. కొద్ది వ్యయ ప్రయాసలతో పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుం టారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కొందరు మిత్రులు అవసర సమయాల్లో అండగా నిల బడతారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యో గాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఏ వ్యవహారమైనా సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశముంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులుండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందక ఇరకాటంలో పడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. బంధువుల నుంచి చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపో తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక సంబంధమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అవసర సమయాల్లో కొందరు మిత్రులు ముఖం చాటేసే అవ కాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.