AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalaram Mandir: నల్లని రూపంలో రామయ్య.. శూర్పణఖ ముక్కు కోసిన ప్రాంతం, సీత గీత దాటిన చోటు ఎక్కడంటే..

పంచవటిలో ఉన్న శ్రీ కాలారామ్ దేవాలయం హిందువుల మత విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. ఈ ఆలయం నల్లరాళ్లతో నిర్మించబడింది. కాలారామ్ ఆలయంలో శ్రీరాముని నల్లని విగ్రహాన్ని ప్రతిష్టించారు. గర్భాలయంలో శ్రీరామునికి కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి. మూలవిరాట్టుకు ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. వాల్మీకి రామాయణంలోని అరణ్య కాండలో పంచవటిని అందంగా వర్ణించారు

Kalaram Mandir: నల్లని రూపంలో రామయ్య.. శూర్పణఖ ముక్కు కోసిన ప్రాంతం, సీత గీత దాటిన చోటు ఎక్కడంటే..
Kalaram Mandir
Surya Kala
|

Updated on: May 28, 2024 | 9:57 AM

Share

శ్రీ రాముడు తన 14 సంవత్సరాల వనవాస కాలంలో ఎక్కువ భాగం పంచవటిలో గడిపాడని నమ్ముతారు. ఈ ప్రదేశంలో రాముడు, సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి అడవిలో ఒక పర్ణశాలను నిర్మించుకున్నాడు. ఈ ప్రదేశానికి సంబంధించి అనేక పురాణ గాధలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని నాసిక్ నగరం అని పిలుస్తారు. రాముడు ఖర్, దూషన్ వంటి రాక్షసులను చంపిన ప్రదేశం ఇదే, అంతేకాదు రావణుడు సీత దేవిని అపహరించిన ప్రదేశం కూడా ఇదే.. అంతేకాదు ఇప్పుడు కాలారామ్ ఆలయం అని పిలువబడే రాముడి గొప్ప ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలోని పంచవటి ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంలో రాముని విగ్రహం నల్లగా ఉండడం వలన ఈ ఆలయానికి కాలారామ్ అని పేరు వచ్చింది.

కాళారామ్ దేవాలయం ప్రత్యేకత పంచవటిలో ఉన్న శ్రీ కాలారామ్ దేవాలయం హిందువుల మత విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. ఈ ఆలయం నల్లరాళ్లతో నిర్మించబడింది. కాలారామ్ ఆలయంలో శ్రీరాముని నల్లని విగ్రహాన్ని ప్రతిష్టించారు. గర్భాలయంలో శ్రీరామునికి కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి. మూలవిరాట్టుకు ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. వాల్మీకి రామాయణంలోని అరణ్య కాండలో పంచవటిని అందంగా వర్ణించారు. అంతేకాదు సీతారాముల వనవాస సమయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు పంచవటి ప్రాంతంలో పర్ణశాలలు వేసుకుని నివసించినట్లు మరికొన్ని గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. పంచవటి ప్రాంతమంతా గోదావరి నది ఒడ్డున ఉన్న సుందరమైన ప్రదేశం.

ఖర్, దూషన్‌ల సంహరణ రామాయణ కథలో పేర్కొన్న శ్రీ రాముడు రాక్షసులైన ఖర్-దూషన్ మధ్య యుద్ధం ఈ ప్రదేశంలో జరిగింది. ఖర్, దూషన్ లంకాపతి రావణుని సోదరులు. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కత్తిరించాడు. దీనికి ప్రతీకారంగా ఖర్, దూషన్ శ్రీరాముడిపైకి యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో రావణుని సోదరులు ఇద్దరూ రాముడిచే వధించబడ్డారు. దీని తరువాత సీతాదేవి అపహరణకు గురైంది. రాముడు పంచవటికి వెళ్ళే మార్గంలో రాబందు జటాయుని కలుసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ పౌరాణిక కథ ప్రసిద్ధమైనది మత విశ్వాసాల ప్రకారం ఆలయానికి సంబంధించిన మరొక కథ ప్రాచుర్యం పొందింది. తన 14 సంవత్సరాల వనవాసంలో శ్రీరాముడు పంచవటికి వచ్చినప్పుడు.. రాక్షసుల దుష్ట కార్యాల నుంచి విముక్తి చేయమని ఋషులు ప్రార్థించారు. అప్పుడు రాముడు వారి ప్రార్థనను అంగీకరించి, నల్లని రూపాన్ని ధరించి, ఆ రాక్షసుల నుంచి వారిని విడిపించాడు. నేటికీ శ్రీ రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు నల్ల విగ్రహాలు ఆలయ గర్భగుడిలో ఉన్నాయి.

పురాతన ఆలయం ఈ ఆలయం చాల పురాతనమైనది. 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు పాలించిన రాష్ట్రకూటుల కాలం నాటిది. మొదటి సారి ముస్లింలు ఈ ఆలయంపై దాడి చేసినప్పుడు ఆలయ పూజారులు రాముని విగ్రహాన్ని గోదావరి నదిలోకి విసిరేశారు. అనంతరం గోదావరి నదిలో తాను విగ్రహ రూపంలో ఉన్నట్లు పేష్వాకు చెందిన సర్దార్ రంగారావు ఒధేకర్ కు కల వచ్చింది. ఆ కల ప్రకారం ఒదేకర్‌ గోదావరి లో ఉన్న విగ్రహాన్ని తెచ్చి కొత్త ఆలయాన్ని 1788లో పునర్నిర్మించారు. రాముని ప్రధాన ఆలయంలో 14 మెట్లు ఉన్నాయి. ఇవి రాముని 14 సంవత్సరాల వనవాసాన్ని సూచిస్తాయి. ప్రధాన ఆలయంలో సభామండపం, ముఖమండపం, సభామండపంతో పాటు నూతన ఆలయాన్ని నిర్మించిన సర్దార్ ఒదేకర్ విగ్రహం కుడా ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు