Hindu Temple: హిందూ ఆలయానికి స్థలాన్ని ఇచ్చిన ముస్లింలు.. గుడి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముస్లింలకు ఘన స్వాగతం
మతం పేరుతో ప్రజలు చీలిపోయి చిన్న వృత్తాన్ని గీచుకుని అందులో బతికేవారు కొందరు.. ఆ వలయాన్ని ఛేదించి అన్ని మతాలు ఒక్కటేనని జీవించే వారు మరికొందరు. తాజాగా హిందువుల ఆలయానికి ముస్లింలు ఊరేగింపుగా వచ్చిన సంఘటన అందరినీ కదిలించింది. అంతే కాకుండా మసీదుకు చెందిన రూ.6 లక్షల విలువైన 3 సెంట్ల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. తిరుపూర్ జిల్లా గణపతిపాళయం పంచాయతీలోని ఒట్టపాళయం గ్రామంలోని రోజ్ గార్డెన్ ప్రాంతంలో 300కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి.
భారత దేశం విభిన్న మతాలకు చెందిన వ్యక్తులు శాంతియుతంగా సహజీవనం చేసే ప్రదేశం. మతాలు వేరైనా మనుషులు ఒకటే అని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం. హిందువులు తమ దేవుళ్లను ఊరేగిస్తుంటే ముస్లింలు దారిలో దాహార్తిని తీర్చిన సంఘటలు గురించి అనేకం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ గ్రామంలోని ముస్లింలు హిందువులు పూజలు చేసుకునేందుకు ఆలయాన్ని నిర్మించడానికి ఏకంగా తమ మసీదులోని భూమి ఇచ్చి మత సామరస్యం అంటే ఇదే అని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఘటనకు వేదికగా తమిళనాడు నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..
మతం పేరుతో ప్రజలు చీలిపోయి చిన్న వృత్తాన్ని గీచుకుని అందులో బతికేవారు కొందరు.. ఆ వలయాన్ని ఛేదించి అన్ని మతాలు ఒక్కటేనని జీవించే వారు మరికొందరు. తాజాగా హిందువుల ఆలయానికి ముస్లింలు ఊరేగింపుగా వచ్చిన సంఘటన అందరినీ కదిలించింది. అంతే కాకుండా మసీదుకు చెందిన రూ.6 లక్షల విలువైన 3 సెంట్ల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. తిరుపూర్ జిల్లా గణపతిపాళయం పంచాయతీలోని ఒట్టపాళయం గ్రామంలోని రోజ్ గార్డెన్ ప్రాంతంలో 300కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ కలిసి నివసిస్తున్నారు.
மத நல்லிணக்கத்திற்கு எடுத்துக்காட்டு.. இந்து கோயில் கட்ட நிலம் கொடுத்த இஸ்லாமியர்கள்!#muslims #hindus #hindumuslims #tirupur #tv9tamil #tamiltv9 pic.twitter.com/8uAQPy7DnI
— TV9 Tamil (@TV9Tamil) May 27, 2024
ఈ గ్రామంలో ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు మసీదు ఉంది. అయితే హిందువులు పూజించడానికి అక్కడ దేవాలయం లేదు. దీంతో ఆ గ్రామంలోని హిందువులు అందరూ కలిసి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆలయ నిర్మాణానికి తగినంత భూమి లేకపోవడంతో ఆలయ నిర్మాణం కష్టతరంగా మారింది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన ముస్లింలు ముందుకు వచ్చారు. ఆర్ ఎంజే రోజ్ గార్డెన్ జమాత్ మసీదుకు చెందిన స్థలాన్ని ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ భూమిని దానం చేసిన తర్వాతే గణపతి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఎట్టకేలకు పనులన్నీ పూర్తయ్యాక సోమవారం ఆలయానికి మహా సంప్రోక్షణ జరిగింది.
అనంతరం ముస్లింలు ఊరేగింపుగా ఆలయానికి వెళ్లారు. ఆలయానికి ఐదు ట్రేలలో గణపతి పూజకు కావాల్సిన సామాగ్రిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయానికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దలతో పాటు ఇరు వర్గాల పిల్లలు పాల్గొన్నారు. ఊరేగింపుగా వచ్చిన ముస్లింలకు పూలమాలలు వేసి హిందువులు స్వాగతం పలికారు. అలాగే ఆలయ వేడుకల్లో ముస్లింల తరపున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం కూడా చేశారు. కులం, మతం వంటి జాతి వివక్షతో చీలిపోయిన వాతావరణంలో సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ముస్లింలు తమ భూమిని విరాళంగా అందజేసి కుంభాభిషేకానికి బారులు తీరి అందరినీ ఆనందపరిచారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..