AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papua New Guinea: కోటి జనాభా ఉన్న ఈ దేశంలో ప్రకృతి విలయతాండవం.. బంగారం, కాఫీ నిల్వలు, 850 భాషలు..

సుమారు 1 కోటి జనాభా కలిగిన పాపువా న్యూ గినియా తనదైన ప్రత్యేకతలను కలిగి ఉంది. దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూ గినియా రాగి, కోబాల్ట్, బంగారం నిల్వలకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని అనేక దేశాలకు భారీ మొత్తంలో కాఫీని సరఫరా చేస్తుంది. పాపువా న్యూ గినియా ఎంత అద్భుతంగా ఉందో తెలుసుకుందాం?

Papua New Guinea: కోటి జనాభా ఉన్న ఈ దేశంలో ప్రకృతి విలయతాండవం.. బంగారం, కాఫీ నిల్వలు, 850 భాషలు..
Papua New Guinea
Surya Kala
|

Updated on: May 28, 2024 | 8:24 AM

Share

పపువా న్యూ గినియాలో ప్రకృతి విలయతాండవం చేసింది. కొండచరియలు విరిగిపదటంతో విధ్వంసం నెలకొంది. కొండచరియలు విరిగిపడటంతో 2 వేల మందికి పైగా చనిపోయారని భావిస్తున్నారు. మే 24న రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పర్వతంలోని కొంత భాగం కూలిపోవడంతో.. శిధిలాలన్నీ నిద్రిస్తున్న గ్రామంపై పడ్డాయి. నిద్రలో ఉన్న గ్రామస్తులు తప్పించుకునే అవకాశం లేదు. నిద్రలోనే శిధిలాలల కింద మృత్యువాత పడ్డారు. ఇప్పటికే బాధితులకు సహాయం చేయడానికి ఆస్ట్రేలియా విమానం, ఇతర అవసరమైన పరికరాలను పంపింది.

సుమారు 1 కోటి జనాభా కలిగిన పాపువా న్యూ గినియా తనదైన ప్రత్యేకతలను కలిగి ఉంది. దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూ గినియా రాగి, కోబాల్ట్, బంగారం నిల్వలకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని అనేక దేశాలకు భారీ మొత్తంలో కాఫీని సరఫరా చేస్తుంది. పాపువా న్యూ గినియా ఎంత అద్భుతంగా ఉందో తెలుసుకుందాం?

కోబాల్ట్, బంగారం, రాగి, కాఫీలకి నిలయం పాపువా న్యూ గినియా కాఫీ ప్రియులకు చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి వాతావరణం, నేల కాఫీ పంటలకు చాలా సారవంతమైన భూమి. అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చే మట్టిలో కాఫీ మొక్కలకు అనువైన నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

పాపువా న్యూ గినియా ప్రపంచంలోనే అతిపెద్ద కోబాల్ట్ ఉత్పత్తిదారుగా పరిగణించబడుతుంది. ఇది ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీలలో ఉపయోగించబడుతుంది. ఈ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించబడుతుంది. ఈ విధంగా పాపువా న్యూ గినియా ఆర్థిక కోణంలో ముఖ్యమైనది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఉపయోగించే పరికరాలలో కోబోల్ట్ ఉపయోగించబడుతుంది. ఇక్కడ బంగారం, రాగి ఖనిజాలు అపారంగా లభ్యమవుతాయి. ఈ లోహాలకు కోట ఈ దేశం. ఇక్కడ భారీ సంఖ్యలో మైనింగ్ కార్మికులు కూడా ఉండడానికి ఇదే కారణం. ఇదే వారి జీవనాధారం.

850 భాషలు మాట్లాడతారు అంత చిన్న దేశంలో ఇన్ని భాషలా అంటూ ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ పాపువా న్యూ గినియాలో 850 భాషలు మాట్లాడతారనేది నిజం. దీనికి కారణం ఇక్కడ నివసించే వర్గాలే. ఇక్కడ అనేక భాషలు అభివృద్ధి చెందాయి. వివిధ గిరిజన సంఘాలు చిన్న చిన్న సమాజాలుగా ఏర్పడి నివసిస్తున్నాయి. వారికి వారి సొంత భాష, జీవన విధానం ఉంది. పాపువా న్యూ గినియా వృక్షజాలం, జంతుజాలం, సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న దేశంగా కూడా పిలువబడుతుంది.

మహిళలపై అత్యధిక హింస రేటు పాపువా న్యూ గినియా మహిళలపై అత్యధిక హింస రేటు ఉన్న దేశాలలో ఒకటి. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ఈ హింసను అంటువ్యాధిగా అభివర్ణించారు. ఒక నివేదిక ప్రకారం ఇక్కడ 70% మంది మహిళలు తమ భాగస్వాములు లేదా భర్తల నుండి హింసకు గురయ్యారు. చికిత్సలో మూడింట రెండు వంతుల మంది మహిళలు కత్తులు, కొడవళ్లు లేదా మొద్దుబారిన ఆయుధాలతో గాయపడినట్లు గుర్తించారు. ఇది దుర్వినియోగ తీవ్రతకు సజీవ సాక్ష్యం. అయినప్పటికీ సామాజిక మార్పు తీసుకురావడంలో ఇక్కడి మహిళలు ముందున్నారు.

పాపువా న్యూ గినియాలో మొత్తం అక్షరాస్యత రేటు ఇప్పటికీ 61.6% మాత్రమే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారడం ప్రారంభించింది. మాధ్యమిక విద్యలో బాలురు, బాలికల మధ్య అంతరం ఉంది. గత 15 సంవత్సరాలుగా ప్రాథమిక విద్యలో అంతరం తగ్గింది. ఎక్కువ మంది బాలికలు ప్రాథమిక పాఠశాలలో చేరుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..