Rage Rituals: ఆ దేశంలో వింత ట్రెండ్.. లక్షలు ఖర్చు పెట్టిమరీ అడవులకు వెళ్లి అరుస్తున్న మహిళలు ఎందుకంటే

ఎందుకంటే కోపంలో తాను ఏమి చేస్తున్నాడో, ఏది సరైనదో అనే విచక్షణ కూడా ఉండదు. అందుకే ప్రజలు తమ కోపాన్ని నియంత్రించుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటారు. ఇందులో యోగా నుంచి ధ్యానం వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రస్తుతం కోపాన్ని తగ్గించడానికి భిన్నమైన పద్దతులను ఆచరిస్తున్నారు. అవును ప్రస్తుతం అమెరికా, అనేక యూరోపియన్ దేశాలలో 'Rage Rituals' అనేది కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. ఇది కొత్త ట్రెండ్‌గా మారింది.

Rage Rituals:  ఆ దేశంలో వింత ట్రెండ్.. లక్షలు ఖర్చు పెట్టిమరీ అడవులకు వెళ్లి అరుస్తున్న మహిళలు ఎందుకంటే
Rage Rituals
Follow us

|

Updated on: May 28, 2024 | 12:56 PM

మనుషులో ఉన్న దుర్గునల్లో ఒకటి కోపం లేదా ఆగ్రహం. మనసుకు నచ్చని మాటలు విన్నా, అనవసరంగా మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా ఎదుటివారిపై కోపం వస్తుంది. కోపం ఎవరికైనా సరే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఎందుకంటే అదొక సహజమైన భావోద్వేగం. అతిగా కోపం వస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. కోపం వ్యక్తులను అన్ని విధాలా తినేస్తుందని అంటారు. ఎందుకంటే కోపంలో తాను ఏమి చేస్తున్నాడో, ఏది సరైనదో అనే విచక్షణ కూడా ఉండదు. అందుకే ప్రజలు తమ కోపాన్ని నియంత్రించుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటారు. ఇందులో యోగా నుంచి ధ్యానం వరకు ఉంది. అయితే ప్రస్తుతం కోపాన్ని తగ్గించడానికి రకరకాల పద్దతులను ఆచరిస్తున్నారు. అవును ప్రస్తుతం అమెరికా, అనేక యూరోపియన్ దేశాలలో ‘Rage Rituals’ అనేది ఒక కొత్త ట్రెండ్‌గా మారింది.

ఈ ట్రెండ్ ఎలా ఉంటుందంటే అడవి మధ్యలో పార్టీలను నిర్వహిస్తారు. అంతేకాదు తమ కోపం తగ్గేవరకూ ఈ అడవుల్లో మహిళలు గట్టిగా అరుస్తారు. ఇందు కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మరీ ఆడవాళ్లు అడవులకు వెళ్లి అరిచి.. తద్వారా తమకు వచ్చిన కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు కోపం చల్లారే వరకు అడవి మధ్యలో విధ్వంసం సృష్టిస్తూనే ఉంటారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం మహిళలు ఈ పార్టీలకు వెళ్లడానికి.. Rage Ritualsలో పాల్గొనడానికి దాదాపు రూ. 5 నుంచి 6 లక్షలు ఖర్చు చేస్తారు.

ఇవి కూడా చదవండి

తమ కోపాన్ని వెళ్లగక్కే మహిళలు

ప్రస్తుతం మియా మ్యాజిక్ అని పిలువబడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమెరికాలో ‘రేజ్ రిచువల్స్’ నిర్వహిస్తోంది. ఇందులో చాలా మంది మహిళలు తమ కోపాన్ని వెళ్లగక్కారు. మియా మ్యాజిక్‌ని మియా బాండుచి అని కూడా అంటారు. మియా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. USA టుడే నివేదిక ప్రకారం మియా ‘మనమందరం అనుభూతి చెందాల్సిన కొన్ని ప్రత్యేక భావోద్వేగాలు ఉన్నాయి. పురుషులు ఏడవడం ఎంత అవసరమో.. మహిళలు కూడా తమ కోపాన్ని వెళ్లగక్కడం అంటే అవసరం అని పేర్కొంది.

ఈ వింత ఘటన ఫ్రాన్స్ లో జరగనుంది గత కొన్నేళ్లుగా తాను ఇలాంటి ఫంక్షన్లు చాలా నిర్వహించానని మియా చెప్పింది. ఆమె వచ్చే ఆగస్టు నెలలో ఫ్రాన్స్‌లో ఒక ఫంక్షన్‌ను నిర్వహించబోతోంది. దీని ధర $6,500 నుండి $8,000 వరకు ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..